Mana Shankara Vara Prasad Garu Censor Review |చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్‌గారు సెన్సార్ టాక్ వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో టాలీవుడ్ అగ్ర హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తోంది. రన్‌టైమ్ ఎంతంటే? మన శంకర వరప్రసాద్‌గారు సెన్సార్ కంప్లీట్ అయ్యింది. యూ ఏ సర్టిఫికేట్ వచ్చింది. రెండు గంటల నలభై రెండు నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేశారు. సెన్సార్ నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీగా సెన్సార్ సభ్యులు మన శంకర వరప్రసాద్ గారుపై ఈ ప్రశంసలు కురిపించినట్లు సమాచారం. శంకర వరప్రసాద్ పాత్రలో చిరంజీవి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. వింటేజ్ చిరంజీవి కనిపిస్తారని అంటున్నారు. చంటబ్బాయి తరహాలో ఆయన క్యారెక్టర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ను పండిస్తుందని చెబుతున్నారు. చిరంజీవి, నయనతార కెమిస్ట్రీ బాగా కుదిరిందట. టామ్ అండ్ జెర్రీలా వారి గొడవలు సరదాగా సాగిపోతాయని, వాటి నుంచి చక్కటి కామెడీని అనిల్ రావిపూడి రాబట్టారని కామెంట్లు వినిపిస్తున్నాయి. వెంకీ ఎంట్రీ పీక్స్... వెంకటేష్ ఎంట్రీ తర్వాత సినిమా స్వరూపమే మారిపోతుందట. చిరంజీవి, వెంకీ కాంబినేషన్లో వచ్చే సీన్లు మొత్తం అభిమానులకు ఐ ఫీస్ట్‌లా ఉంటాయట. ఈ సీన్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమేనని టాక్ వినిపిస్తోంది. చిరు, వెంకీ పంచ్‌లు, వారిపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌తో సెకండాఫ్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లా ఉంటుందని చెబుతున్నారు. అనిల్ రావిపూడి శైలి పంచ్‌లు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎక్కువగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. భీమ్స్ పాటలు ఇప్పటికే సూపర్ హిట్టయ్యాయి. విజువల్‌గా మీసాలపిల్లాతో పాటు శశిరేఖ పాటలు ఆకట్టుకుంటాయని టాక్ వినిపిస్తోంది. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్లో ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమాను సాహు గారపాటితో కలిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదల నిర్మిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం జరుగనున్నట్లు సమాచారం. మోకాలి సర్జరీ కారణంగా చిరంజీవి ఇప్పటివరకు ప్రమోషన్స్‌కు అటెండ్ కాలేదు. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.