త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mimi Chakraborty | ప్రియుడితో సీక్రెట్‌గా ఏడ‌డుగులు వేసిన స్టార్ హీరోయిన్ – రెండు సార్లు పెళ్లి వేడుక‌లు

బెంగాళీ స్టార్ హీరోయిన్ మిమి చ‌క్ర‌వ‌ర్తి ప్రియుడితో సీక్రెట్‌గా ఏడ‌డుగులు వేసింది. మెరైన్ ఇంజినీర్ సిద్దార్థ్ ద‌త్తాను రిజిస్ట‌ర్ మ్యారేజీ చేసుకుంది. రెండు సార్లు ఈ జంట పెళ్లి వేడుక‌లు జ‌రుగనున్నాయి. డిసెంబ‌ర్ 5న మ‌రోసారి సంప్ర‌దాయ‌బ‌ద్దంగా మిమిచ‌క్ర‌వ‌ర్తి, సిద్దార్థ్ ద‌త్తా వివాహం చేసుకోబోతున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Nov 27, 2026, 3.07 pm IST

Mimi Chakraborty | ప్రియుడితో సీక్రెట్‌గా ఏడ‌డుగులు వేసిన స్టార్ హీరోయిన్ – రెండు సార్లు పెళ్లి వేడుక‌లు
Advertisement

Mimi Chakraborty |  బెంగాళీ స్టార్ హీరోయిన్ మిమిచ‌క్ర‌వ‌ర్తి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రియుడు సిద్దార్థ్ ద‌త్తాను పెళ్లిచేసుకుంది. కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో మిమి చ‌క్ర‌వ‌ర్తి, సిద్దార్థ్ గురువారం కోల్‌క‌తాలో రిజిస్ట‌ర్ మ్యారేజీ చేసుకున్నారు. చ‌ట్ట‌బ‌ద్ద పెళ్లి వేడుక‌ల తాలూకు ఫొటోల‌ను మిమి చ‌క్ర‌వ‌ర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. భ‌ర్త ముఖాన్ని మాత్రం చూపించ‌కుండా ఫొటోలు పోస్ట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

రెండు సార్లు వేడుక‌లు...

ఈ జంట రెండు సార్లు పెళ్లి వేడుక‌ల‌ను జ‌రుపుకోబోతున్నారు. తొలుత రిజిస్ట‌ర్ మ్యారేజీ చేసుకొని ఆ త‌ర్వాత త‌మ సంప్ర‌దాయం ప్ర‌కారం మ‌రోసారి పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. డిసెంబ‌ర్ 5న కాలిపాంగ్‌లో మూడు రోజుల పాటు ట్రెడిష‌న‌ల్ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుగ‌నున్నాయి. డిసెంబ‌ర్ 11న కోల్‌క‌తాలో రిసెప్ష‌న్ ఏర్పాటుచేయ‌బోతున్నారు.

మెరైన్ ఇంజినీర్‌...

సిద్దార్థ్ ద‌త్తాకు సినిమాల‌తో సంబంధం లేద‌ని తెలిసింది. మెరైన్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న‌ట్లు స‌మాచారం. స్నేహితుల ద్వారా ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. పెళ్లితో త‌మ బంధాన్ని మ‌రో అడుగు ముందుకు తీసుకెళ్లారు.

స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా...

బెంగాళీలో మిమి చ‌క్ర‌వ‌ర్తి స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా కొన‌సాగుతోంది. బోఝేనా షే బోఝేనా , ప్ర‌ళ‌య్‌, గ్యాంగ్‌స్ట‌ర్‌, యోద్ద ది వారియ‌ర్‌తో పాటు ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చేసింది.

ఎంపీగా...

2019లో రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టింది మిమి చ‌క్ర‌వ‌ర్తి. తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. జాద‌వ్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందింది. 2024లో లోక్‌స‌భ ఎన్నిక‌లకు కొద్ది రోజుల ముందు ఎంపీ స్థానంతో పాటు తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి మిమి చ‌క్ర‌వ‌ర్తి రాజీనామా చేయ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

Advertisement
Advertisement