Tollywood | రొమాంటిక్ కామెడీ సినిమాతో తొలి ప్రేమ డైరెక్టర్ రీ ఎంట్రీ – ఏడేళ్ల తర్వాత ఛాన్స్
తొలి ప్రేమ డైరెక్టర్ కరుణాకరణ్ ఏడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బెల్లంకొండ సురేష్ తనయుడు గణేష్ హీరోగా కరుణాకరణ్ డైరెక్షన్‌లో న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. సోమవారం ఈ సినిమా అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది.
Entertainment | Published On Apr 20, 2026, 6.34 pm IST
Tollywood | పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలి ప్రేమ సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు కరుణాకరన్. తొలి సినిమాతోనే పెద్ద సక్సెస్‌ను అందుకున్నాడు. పవన్ కళ్యాణ్‌కు స్టార్ ఇమేజ్‌ను తీసుకొచ్చిన సినిమాల్లో ఒకటిగా తొలి ప్రేమ నిలిచింది. ఆ తర్వాత వాసు, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ సినిమాలతో దర్శకుడిగా తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడు కరుణాకరన్. రామ్ ఎందుకంటే ప్రేమంట సినిమాతో కరుణాకరన్ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. తేజ్ ఐ లవ్ యూతో పాటు చిన్నదాన నీకోసం కూడా ఫెయిల్యూర్‌గా నిలిచాయి. ఈ డిజాస్టర్లతో టాలీవుడ్‌లో కనిపించకుండాపోయారు కరుణాకరన్.
రొమాంటిక్ కామెడీ మూవీ...
దాదాపు ఏడేళ్ల తర్వాత డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బెల్లంకొండ సురేష్ తనయుడు గణేష్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాకు జాతిరత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్ డైలాగ్స్ అందించబోతున్నారు. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
త్వరలో రెగ్యులర్ షూటింగ్...
కరుణాకరణ్ శైలి హ్యూమర్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుంది. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
స్వాతిముత్యం సినిమాతో హీరోగా మారారు బెల్లంకొండ గణేష్ బాబు, ఆ తర్వాత నేను స్టూడెంట్‌నే సార్ అనే సినిమా చేశాడు. అతడు హీరోగా నటిస్తోన్న మూడో సినిమా ఇది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



