Bandla Ganesh | నిర్మాతగా మారిన బండ్ల గణేష్ కూతురు – డెబ్యూ మూవీ టైటిల్ ఇదే
టాలీవుడ్ కమెడియన్ బండ్ల గణేష్ కూతురు నిర్మాతగా మారింది. మండువా లోగిలి పేరుతో ఓ చిన్న సినిమాను నిర్మించాడు. ఈటీవీ విన్ ఓటీటీతో కలిసి బండ్ల గణేష్ కూతురు నిర్మించిన ఈ మూవీ త్వరలో థియేటర్లలోకి రాబోతుంది.
Entertainment | Published On Feb 28, 2026, 3.43 pm IST
Bandla Ganesh | కమెడియన్‌గా కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత ప్రొడ్యూసర్‌గా మారారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్, రవితేజ ఆంజనేయులుతో పాటు ఎన్టీఆర్‌తో బాద్‌షా, టెంపర్ సినిమాలతో నిర్మాతగా పెద్ద విజయాలను అందుకున్నారు. టెంపర్ తర్వాత సినిమా నిర్మాణానికి కూడా దూరమయ్యాడు. ప్రొడ్యూసర్‌గా బండ్ల గణేష్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొద్ది రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లను నిజం చేస్తూ బీజీ బ్లాక్‌బస్టర్స్ పేరుతో ఓ కొత్త బ్యానర్‌ను ఇటీవల లాంఛ్ చేశారు. నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ఈ బ్యానర్‌లో చేయబోతున్నట్లు ప్రకటించారు.
మండువా లోగిలి...
తాజాగా బీజీ బ్లాక్‌బస్టర్స్ బ్యానర్‌పై తొలి సినిమాను బండ్ల గణేష్ అనౌన్స్ చేశాడు.మండువాలోగిలి పేరుతో ఓ చిన్న సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈటీవీ విన్ మొదలై మూడేళ్లు అయిన సందర్భంగా తమ ప్లాట్‌ఫామ్ ద్వారా రానున్న అప్‌కమింగ్ మూవీస్, వెబ్‌సిరీస్ లిస్ట్‌ను రివీల్ చేసింది. ఈ లిస్ట్‌లో మండువా లోగిలి మూవీ కూడా ఒకటిగా ఉంది. ఈటీవీ విన్‌తో కలిసి బండ్ల గణేష్ కూతురు జనని ఈ సినిమాను నిర్మిస్తోంది. బండ్ల గణేష్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే రిలీజ్ కానుందట. ఇప్పటికే షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను వెల్లడిస్తామని పేర్కొన్నారు.
పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో...
మండువా లోగిలి మూవీకి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందుతోన్నట్లు ప్రీ లుక్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. హీరోహీరోయిన్లు ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు. మండువా లోగిలి మూవీలో కొత్త నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో బండ్ల గణేష్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేసినట్లు చెబుతోన్నారు. ప్రస్తుతం నటుడిగా కూడా సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని సినిమాలో బండ్ల గణేష్ నటించాడు. శివాజీ హీరోగా నటించిన ఈ మూవీ మార్చి 6న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



