త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RGV | బాహుబ‌లి సినిమాను 5 ల‌క్ష‌ల్లో తీయొచ్చు – ఆర్‌జీవీ కామెంట్స్ వైర‌ల్

ఏఐ టెక్నాల‌జీతో బాహుబ‌లి లాంటి సినిమాను కెమెరా కూడా అవ‌స‌రం లేకుండా ఐదు ల‌క్ష‌ల బ‌డ్జెట్‌తోనే తీయ‌చ్చ‌ని డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ అన్నారు. బ‌ల‌గం లాంటి ఎమోష‌న‌ల్ సినిమాను ఏఐతో తీయ‌లేమ‌ని చెప్పారు. ఆర్‌జీవీ కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Mar 15, 2026, 5.01 pm IST

RGV | బాహుబ‌లి సినిమాను 5 ల‌క్ష‌ల్లో తీయొచ్చు – ఆర్‌జీవీ కామెంట్స్ వైర‌ల్
Advertisement

RGV |  ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ రాక‌తో సినిమా రంగంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఏఐ సాంకేతిక‌త‌ను క‌థను రెడీ చేసుకునే ద‌గ్గ‌ర నుంచి ప్ర‌మోష‌న్ల వ‌ర‌కు విరివిగా వాడేస్తున్నారు మేక‌ర్స్‌. కొంద‌రు ద‌ర్శ‌కులు అయితే ఓ అడుగు ముందే వేసి ఏఐతో ఫుల్ సినిమానే తీసేశారు. డ‌బ్బింగ్‌, మ్యూజిక్‌, డీ ఏజింగ్ అనేక విధాలుగా ఏఐ ఉప‌యోగ‌ప‌డుతోంది. అయితే ఈ ఏఐ వాడ‌కంపై లాభాల‌తో పాటు అదే స్థాయిలో న‌ష్టాలు కూడా ఉన్నాయ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. నాచుర‌ల్ గ్రాఫిక్స్‌తో పోలిస్తే ఏఐతో చేసిన‌వాటిలో క్వాలిటీ అంత‌గా ఉండ‌ద‌న్న‌ది కొంద‌రు వాద‌న‌. ఎమోష‌న్స్‌ను ఏఐ రీక్రియేట్ చేయ‌లేదంటూ చెబుతోన్నారు.
తాజాగా ఏఐ టెక్నాల‌జీపై లెజెండ‌రీ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

ఐదు ల‌క్ష‌ల్లో...

ఏఐ టెక్నాల‌జీని వాడుకొని బాహుబ‌లి లాంటి సినిమాను ఐదు ల‌క్ష‌ల్లో తీయొచ్చ‌ని రామ్‌గోపాల్ వ‌ర్మ‌ అన్నారు. అదే బ‌ల‌గం సినిమాను తీయ‌డానికి మాత్రం రెండు కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని చెప్పారు
"ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏఐని వాడుకొని బాహుబ‌లిని చీప్‌గా తీయొచ్చు. బ‌ల‌గం లాంటి సినిమా తీయ‌డానికి మాత్రం చాలా ఖ‌ర్చ‌వుతుంది. వీఎఫ్ఎక్స్‌, ఎపిక్ సెట్స్‌...భారీ ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్‌తో కూడిన వాటిని ఏఐ తో అవ‌లీల‌గా చేయ‌చ్చు. కానీ సెటిల్డ్ ప‌ర్ఫార్మెన్స్‌, న‌టీన‌టుల నుంచి ఎమోష‌న్‌ను మాత్రం సాధ్యం కాదు. బ‌ల‌గం లాంటి సినిమాల‌ను కెమెరాతోనే తీయ‌గ‌లం. బాహుబ‌లిని ప్రాప్టింగ్‌తో తీయొచ్చు. ఏఐతో బాహుబ‌లి కెమెరా లేకుండా కేవ‌లం ఐదు ల‌క్ష‌ల్లో  కంప్లీట్ చేయడం  సాధ్యమవుతుంది. అదే బ‌లగం సినిమా చేయ‌డానికి మాత్రం రెండు కోట్లు ఖ‌ర్చుఅ వుతుంది" అని రామ్‌గోపాల్ వ‌ర్మ అన్నారు. ఆయ‌న కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.
తుంబాద్ డైరెక్ట‌ర్ ర‌వి అనిల్ బార్వే మ‌న్ పిశాచ్ పేరుతో కేవ‌లం 33 వేల రూపాయ‌ల‌తోనే ఓ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు ప్ర‌క‌టించాడు.

Advertisement
Advertisement