Ashika Ranganath | మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ.. శర్వాకు జోడీగా ఆషికా ఫిక్స్..!
Ashika Ranganath | కన్నడ భాయ ఆషిక రంగనాథ్ తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నది. హిట్స్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో వరుస అవకాశాలను దక్కించుకుంటున్నది. ఇటీవల మాస్ మహరాజ రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Entertainment | Published On Jan 21, 2026, 3.11 pm IST
Ashika Ranganath | కన్నడ భాయ ఆషిక రంగనాథ్ తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నది. హిట్స్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో వరుస అవకాశాలను దక్కించుకుంటున్నది. ఇటీవల మాస్ మహరాజ రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’లో సైతం నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
తాజాగా సంక్రాంతి రేసులో వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సాలిడ్ హిట్ అందుకున్న ఈ భామ మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. చార్మింగ్ స్టార్ శర్వానంద్ త్వరలో శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ మూవీని చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ ఆఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మూవీలో హీరోయిన్‌గా ఆషిక రంగనాథ్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. శర్వానంద్, ఆషిక కెమెస్ట్రీ బాగుంటుందని మేకర్స్ భావించారని తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మూవీని సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
ఇటీవల శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ సైతం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ అందుకుంది. నారీ నారీ నడుమ మురారిలో శర్వానంద్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, వినోదంతో పాటు కుటుంబ భావోద్వేగాలతో తెరకెక్కించిన మూవీ సంక్రాంతి పండగ సమయంలో ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఇక ఆషిక రంగనాథ్ అమిగోస్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జున నా సామిరంగా మూవీలో నటించింది. తాజాగా భర్త మహశయులకు విజ్ఞప్తి మూవీలో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. మెగాస్టార్ విశ్వంభరతో పాటు తమిళంలో సర్దార్ 2 మూవీలో నటించనున్నది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






