Anasuya | హీరోయిన్ల డ్రెస్‌లపై సీనియర్ యాక్టర్ శివాజీ చేసిన కామెంట్లు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. నిండుగా కనిపించే బట్టల్లో అందం ఉంటుంది కానీ సామాన్లు కనిపించే దుస్తుల్లో ఉండదంటూ దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్ సెన్స్ గురించి శివాజీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అతడి కామెంట్లను కొందరు నెటిజన్లు సపోర్ట్ చేస్తుండగా...చాలా మంది తప్పుపడుతున్నారు. శివాజీ స్టేజ్‌పైనే బూతులు మాట్లాడటంతో అతడిపై ఫైర్ అవుతున్నారు. సీనియర్ యాక్టర్ అయ్యుండి ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు. అనసూయ పోస్ట్... నెటిజన్లు మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు కొంతమంది హీరోయిన్లపై శివాజీ చేసిన కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివాజీకి యాంకర్ అనసూయతో పాటు సింగర్ చిన్మయి గట్టి కౌంటర్ ఇచ్చారు.శివాజీ వ్యాఖ్యలపై తనదైన స్టైల్‌లో అనసూయ ఘాటుగా స్పందించింది. ఇది నా శరీరం నీది కాదు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో శివాజీతో పాటు ఎవరి పేరు ప్రస్తావించలేదు అనసూయ. కానీ శివాజీని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అనసూయ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇండస్ట్రీలోని మహిళలను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడిన ప్రతిసారి అనసూయ రియాక్ట్ అవుతూనే ఉంటుంది. శివాజీగా గట్టిగా ఆన్సర్ ఇచ్చిందని అనసూయ పోస్ట్‌ను ఉద్దేశించి నెటిజన్లు పేర్కొంటున్నారు. మెట్టెలు పెట్టుకోవాలి.... సింగర్ చిన్మయి కూడా శివాజీ కామెంట్లపై ఘాటుగా రిప్లై ఇచ్చింది. అతడిపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడింది. "దరిద్రపు... లాంటి అసభ్యమైన పదాలతో శివాజీ హీరోయిన్లకు అనవసరమైన సలహాలు ఇచ్చారు. చీరతో సామాన్లను కప్పుకోవాలన్నారు. దరిద్రపు....అనే పదాలు వాడేందుకు అదేమైనా ప్రొఫెషనల్ స్పెసా. ఆయనేమో జీన్స్ హూడీ ధరించాలి. మిగిలిన వారు అలా ఉండొద్దా. డ్రెస్సింగ్ సెన్స్‌పై అంత గౌరవం ఉంటే ఆయన ధోతి మాత్రమే ధరించాలి. ఇండియన్ కల్చర్‌ను ఫాలో అవుతూ బొట్టు పెట్టుకోవాలి. పెళ్లి అయినట్లు తెలియడానికి చేతికి కంకణం ధరించడమే కాకుండా కాళ్లకు మెట్టెలు పెట్టుకోవాలి" అంటూ చిన్మయి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. చిన్మయి పోస్ట్ ట్రెండ్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు శివాజీ తన వ్యాఖలను వెనక్కి తీసుకోవాలని భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అనసూయ, చిన్మయి పోస్ట్‌లకు శివాజీ ఎలా రియాక్ట్ అవుతాడన్నది ఆసక్తికరంగా మారింది. దండోరా రిలీజ్‌కు ముందు శివాజీ ఈ కామెంట్స్ చేయడంతో సినిమా కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.