త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aanasuya | శివాజీ సృష్టించిన చీర క‌ట్టుకొని తిరుగుతున్నా – అన‌సూయ సెటైరిక‌ల్ పోస్ట్ వైర‌ల్‌

సీనియ‌ర్ హీరో శివాజీపై మ‌రోసారి పంచ్‌లు వేసింది అన‌సూయ‌. శివాజీ దెబ్బ‌కు అన‌సూయ చీర‌ల్లో మాత్ర‌మే క‌నిపిస్తోంది అంటూ ఓ నెటిజ‌న్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అత‌డి ట్వీట్‌కు అన‌సూయ ఫ‌న్నీగా రిప్లై ఇచ్చింది. శివాజీ క‌నిపెట్టే వ‌ర‌కు మేము చీర‌లే క‌ట్టుకోలేదంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

N

Entertainment | Published On Apr 11, 2026, 5.48 pm IST

Aanasuya | శివాజీ సృష్టించిన చీర క‌ట్టుకొని తిరుగుతున్నా – అన‌సూయ సెటైరిక‌ల్ పోస్ట్ వైర‌ల్‌
Advertisement

Aanasuya | సీనియ‌ర్ న‌టుడు శివాజీ, యాంక‌ర్ అన‌సూయ మ‌ధ్య గొడ‌వ అప్ప‌ట్లో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్‌ల‌పై శివాజీ అభ్యంత‌రక‌ర కామెంట్స్ చేశారు. శివాజీ వ్యాఖ్య‌ల‌పై అన‌సూయ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మీ స‌ల‌హాలు మాకు అవ‌స‌రం లేదంటూ విరుచుకుప‌డింది. ఈ గొడ‌వ ముదిరి పెద్ద‌ది అయ్యింది. అన‌సూయ‌కు ప‌లువురు హీరోయిన్లు స‌పోర్ట్‌గా నిలిచారు. చివ‌ర‌కు శివాజీకి మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు ఇచ్చే వ‌ర‌కు వివాదం చేరుకుంది. శివాజీ సైలెంట్ కావ‌డంతో ఈ గొడ‌వ‌కు పుల్‌స్టాప్ ప‌డింది.

చీర‌లు క‌ట్టుకొని...

తాజాగా శివాజీతో వివాదాన్ని గుర్తుచేస్తూ ఓ నెటిజ‌న్ అన‌సూయ‌ను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టాడు. శివాజీ దెబ్బ‌తో అన‌సూయ మోడ్ర‌న్ డ్రెస్‌లు ప‌క్క‌న‌పెట్టి ప‌ట్టు చీరల‌ను క‌ట్టుకొని తిరుగుతుంది అంటూ సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో చీర‌క‌ట్టులో ట్రెడిష‌న‌ల్ లుక్‌లో అన‌సూయ క‌నిపిస్తోంది. నెటిజ‌న్ పోస్ట్‌పై సెటైరిక‌ల్‌గా అన‌సూయ రియాక్ట్ అయ్యింది. శివాజీతో పాటు స‌ద‌రు నెటిజ‌న్‌పై పంచ్‌లు వేసింది. చీర అనే వ‌స్త్రాన్ని శివాజీ సృష్టించాడంటూ ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ పెట్టింది.

చూసుకోవాలి క‌దా....

"శివాజీ సృష్టించిన చీర అనే వ‌స్త్రాన్ని ధ‌రించి తిరుగుతున్న అన‌సూయ‌...ఇది క‌దా రాయాల్సింది. ఎందుకంటే అంత‌కుముందు మేమంతా అస‌లు చీర‌లే ధ‌రించ‌లేదు. ఎంట‌మ్మా చూసుకోవాలి క‌దా పోస్ట్ చేసే ముందు అంటూ వ్యంగ్యంగా పోస్ట్‌కు అన‌సూయ‌ రిప్లై ఇచ్చింది". అన‌సూయ ట్వీట్‌ వైర‌ల్ అవుతోంది.

నాగ‌బంధం సినిమా...

హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు రిలీజ్ త‌ర్వాత సినిమాల‌కు బ్రేక్ ఇచ్చిన అన‌సూయ ప్ర‌స్తుతం నాగ‌బంధం సినిమా చేస్తోంది. విరాట్ క‌ర్ణ హీరోగా న‌టించిన ఈ సినిమాలో న‌భాన‌టేష్‌, ఐశ్వ‌ర్య మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. జూలై 3న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

Advertisement
Advertisement