Allu Arjun | హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్ – కారణం ఇదే
అనుమతి లేకుండా తన పేరు, ఇమేజ్‌తో పాటు వాయిస్‌ను వాడుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ పిటిషన్ వేశారు.
Entertainment | Published On Apr 17, 2026, 5.18 pm IST
Allu Arjun | వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ స్టార్ హీరోలు వరుసగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు కోర్టు మెట్లు ఎక్కారు. తాజాగా వారిని అల్లు అర్జున్ ఫాలో అయ్యాడు. అనుమతి లేకుండా తన పేరు, ఇమేజ్, వాయిస్, వీడియోలను ఎలాంటి వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం వాడుకోకుండా కఠిన ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అల్లు అర్జున్, పేరు ఫొటోలను వాడుతూ ఫేక్ యాప్‌లను సృష్టిస్తున్నారని, ఏఐతో అతడి వాయిస్‌ను క్లోనింగ్ చేస్తూ దుర్వినియోగం చేస్తున్నారని అల్లు అర్జున్ తరఫు లాయర్ ఢిల్లీ హైకోర్టులో తన వాదనలు వినిపించారు.
తక్షణమే నిలిపేయాలి...
అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా అనధికారికంగా అతడి పేరును ఉపయోగిస్తూ పలు సంస్థలు వ్యాపారాలు చేస్తున్నాయని, వాటిని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని అల్లు అర్జున్ లాయర్ హైకోర్టులో పేర్కొన్నారు. అల్లు అర్జున్ పిటిషన్‌పై కోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
పుష్ప 2 షూటింగ్ టైమ్‌లో అల్లు అర్జున్ పేరుతో వీడియో కాల్స్ స్కామ్‌కు కొందరు పాల్పడ్డారు. అవన్నీ ఫేక్ అంటూ డైరెక్టర్ సుకుమార్ అప్పట్లో క్లారిటీ ఇచ్చారు.
రాకాతో బిజీ....
కాగా ప్రస్తుతం రాకా షూటింగ్‌తో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. అట్లీ దర్శకత్వంలో సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. దాదాపు 1300 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
రాకాతో పాటు లోకేష్ కనగరాజ్‌తో మరో మూవీ చేయబోతున్నాడు అల్లు అర్జున్. ఈ పాన్ ఇండియన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



