త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | ఓ వైపు సినిమాలు చేస్తూనే.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీ‌లీల‌..!

Sreeleela | టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ‌లీల మెడిసిన్ పూర్తి చేసింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు వైద్య విద్య‌ను చ‌దివిన శ్రీ‌లీల‌.. తాజాగా ఎంబీబీఎస్ డిగ్రీని అందుకున్నారు. కాన్వొకేషన్‌లో మెడిసిన్ పట్టా అందుకున్నారు.

P

Entertainment | Published On Feb 11, 2026, 4.06 pm IST

Sreeleela | ఓ వైపు సినిమాలు చేస్తూనే.. ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీ‌లీల‌..!
Advertisement

Sreeleela | టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ‌లీల మెడిసిన్ పూర్తి చేసింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు వైద్య విద్య‌ను చ‌దివిన శ్రీ‌లీల‌.. తాజాగా ఎంబీబీఎస్ డిగ్రీని అందుకున్నారు. కాన్వొకేషన్‌లో మెడిసిన్ పట్టా అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. శ్రీ‌లీల త‌న త‌ల్లి డాక్ట‌ర్ స్వ‌ర్ణ‌ల‌త‌ను ఆద‌ర్శంగా తీసుకొని మెడిసిన్ వైపు అడుగులు వేసింది. సినిమాల‌తో బిజీగా ఉన్నా.. చ‌దువుపై దృష్టి పెట్టి ల‌క్ష్యాన్ని చేరుకుంది. వాస్త‌వానికి వైద్యురాలిగా ప‌ని చేయాల‌ని శ్రీ‌లీల కోరిక‌. చిన్నతనంలో తన అమ్మమ్మ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డ్డ స‌మ‌యంలో ఓ వైద్యురాలిగా తాను చేయాల‌నుకుంది. తాజాగా త‌న కోరిక‌ను నెర‌వేర్చుకుంది. సినిమాలు చేస్తూనే.. ఖాళీ స‌మ‌యాల్లో చ‌ద‌వును కొన‌సాగించింది. తాజాగా కాన్వొకేష‌న్‌లో ప‌ట్టా అందుకుంది.

ఇక శ్రీ‌లీల సినిమాల విష‌యానికి వ‌స్తే.. చివ‌రిసారిగా త‌మిళంలో ప‌రాశ‌క్తి సినిమాలో న‌టించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం మూడు సినిమాల్లో న‌టిస్తున్న‌ది. తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాన్ స‌ర‌స‌న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీలో న‌టిస్తున్న‌ది. ఈ మూవీ మార్చిలో విడుద‌ల కానున్న‌ది. అదే స‌మ‌యంలో బాలీవుడ్‌లో అనురాగ్ బ‌సు మూవీలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. త‌మిళంలో ధ‌నుష్ 55 సినిమాలోనూ ఓ హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ది. ఇటీవ‌ల సినిమా షూటింగ్ మొద‌లైంది. సినిమాలు ప్లాఫ్‌.. హిట్‌తో సంబంధం లేకుండా శ్రీ‌లీల వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ దూసుకెళ్తున్న‌ది.

Advertisement
Advertisement