త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malavika Mohanan | ట్రెండ్స్ కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యం..! ఫిట్‌నెస్, ఫ్యాషన్‌పై మాలవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Malavika Mohanan | మాలవిక మోహ‌న‌న్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బియాండ్ ది క్లౌడ్స్‌, మాస్ట‌ర్‌, మార‌న్ సినిమాల‌తో న‌టించి మంచి గుర్తింపు పొందింది. తాజాగా ప్ర‌భాస్ న‌టించిన ది రాజా సాబ్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా మిగిలింది.

P

Entertainment | Published On Feb 11, 2026, 1.30 pm IST

Malavika Mohanan | ట్రెండ్స్ కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యం..! ఫిట్‌నెస్, ఫ్యాషన్‌పై మాలవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

Malavika Mohanan | మాలవిక మోహ‌న‌న్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బియాండ్ ది క్లౌడ్స్‌, మాస్ట‌ర్‌, మార‌న్ సినిమాల‌తో న‌టించి మంచి గుర్తింపు పొందింది. తాజాగా ప్ర‌భాస్ న‌టించిన ది రాజా సాబ్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా మిగిలింది. అయితే, ఈ బ్యూటీ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ఫిట్‌నెస్‌తో పాటు ఫ్యాష‌న్‌పై ఆస‌క్తిక వ్యాఖ‌ల్యు చేసింది. సినిమా తెరపై కనిపించే గ్లామర్‌కు మించి, ఫిట్‌నెస్, ఫ్యాషన్ తన వ్యక్తిత్వానికి అంతర్భాగాలని మాలవిక మోహనన్ స్పష్టం చేసింది. అవి తనకు ట్రెండ్స్ కోసం అనుసరించే అంశాలు కాదని, జీవనశైలిలో కలిసిపోయిన విలువలని చెప్పింది.

'చిన్నప్పటి నుంచే క్రీడలు నా జీవితంలో భాగం. నేను స్ప్రింట్ రన్నర్‌ని. లాంగ్ జంపర్‌గా అథ్లెటిక్స్‌లో చురుకుగా పాల్గొనేదాన్ని. ఆ అనుభవం వల్ల శారీరక శ్రమ నాకు సహజంగా అనిపిస్తుంది' అని మాలవిక తెలిపింది. తంగలాన్ మూవీలో గిరిజన దేవత పాత్ర కోసం ఆమె సిలంబం అనే ప్రాచీన తమిళ యుద్ధ‌కళను చేర్చుకున్న‌ట్లు తెలిపింది. స్టిక్ ఫైటింగ్ త‌ర‌హాలో ఉండే ఈ క‌ళ‌ను సినిమా కోసం నేర్చుకోవ‌డం మొద‌లుపెట్టాన‌ని.. ప్ర‌స్తుతం అది త‌న ఫిట్‌నెస్ రొటీన్‌లో భాగ‌మైంద‌ని తెలిపింది. వారానికి రెండు, మూడుసార్లు సాధ‌న చేస్తాన‌ని పేర్కొంది. ఫిట్‌నెస్ విష‌యంలో ట్రెండ్స్ అనుస‌రించ‌డాన్ని తాను స‌మ‌ర్థించ‌న‌ని.. మ‌న‌కు న‌చ్చ‌నిదాన్ని బ‌ల‌వంతం చేస్తే ఎక్కువ కాలం నిలువ‌ద‌ని తెలిపింది. త‌న‌కు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, సిలంబం, కాలిస్టెనిక్స్ అంటే ఇష్ట‌మ‌ని, షూటింగ్‌లతో బయట ఉన్నా హోటల్ గదిలోనే పుష్‌అప్స్, బాడీవెయిట్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తాన‌ని తెలిపింది. క్రమశిక్షణ అంటే మనకు ఇష్టమైన దాన్ని నిరంతరం కొన‌సాగించ‌డ‌మేన‌ని చెప్పుకొచ్చింది.

ఫ్యాష‌న్‌పై మాట్లాడుతూ ఎప్పుడూ ఒకే త‌ర‌హా స్ట‌యిల్ ఇష్టం లేద‌ని.. భారతదేశంలో పెరిగిన మనకు ఎన్నో సంస్కృతులు, దుస్తుల శైలులు సహజంగానే చేరువ అవుతాయి తెలిపింది. త‌న అమ్మ చేతి నూలు చీరలు, ఇక్క‌త్‌, బ్లాక్ ప్రింట్ చీర‌లు ధరించి, నుదుటిపై పెద్ద ఎర్ర బొట్టు, కళ్లకి కాజల్, జుట్టులో మల్లెపూలతో కనిపించేద‌ని... త‌న స్ట‌యిల్ సైతం అక్క‌డి నుంచే నా స్టైల్ భావన అక్కడి నుంచే మొద‌లైంద‌ని గుర్తు చేసుకుంది. స్టైల్ అనేది ఫ్యాషన్ కంటే ఎక్కువగా సంస్కృతి, గుర్తింపు, జ్ఞాపకాలతో ముడిపడి ఉంటుందని తెలిపింది. తాను గ్లోబ‌ల్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతాన‌ని.. కానీ నుదుటిపై చంద‌నం, కొప్పులో గ‌జ్రా పెట్టుకోవడం వంటి చిన్న విష‌యాలు త‌న‌కు న‌చ్చుతాయ‌ని, అవి త‌న మూలాల‌ను గుర్తు చేస్తాయ‌ని తెలిపింది. ఫిట్‌నెస్ అనేది శారీర‌క బ‌ల‌మే కాకుండా ఆత్మ‌విశ్వాసానికి మూల‌మ‌ని, ఫ్యాష‌న్ అలంకారం కాద‌ని.. వ్య‌క్తిత్వానికి ప్ర‌తిబింబ‌మ‌ని తెలిపింది.

Advertisement
Advertisement