Padmavathi Temple | వైభవంగా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
Padmavathi Temple | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను వేగవంతం చేయాలని టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు.
Devotional | Published On Nov 13, 2026, 7.32 pm IST
- డిసెంబర్ 6 నుంచి 14 వరకు ఉత్సవాలు
- నవంబర్ 20లోగా రథోత్సవ పనులు పూర్తి చేయాలి
- పంచమి తీర్థం పడి ఊరేగింపునకు పకడ్బందీ ఏర్పాట్లు : శరత్
Padmavathi Temple | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. డిసెంబరు 6 నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను వేగవంతం చేయాలని టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డిసెంబరు 14న నిర్వహించనున్న పంచమి తీర్థం, పడి ఊరేగింపునకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శుక్రవారం వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రథోత్సవ పనులకు గడువు
అమ్మవారి ఆభరణాలు, వాహనాలు, బంగారు రథం శుభ్రపరిచే పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జేఈఓ ఆదేశించారు. రథోత్సవానికి సంబంధించి రథం చెక్క పనులు, రంగులు వేయడం, చక్రాల ఫిట్‌నెస్ తదితర పనులను నవంబరు 20వ తేదీలోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు గడువు విధించారు. ఎలాంటి జాప్యం లేకుండా పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. పంచమి తీర్థం సందర్భంగా తిరుమల నుంచి ప్రారంభమయ్యే పడి ఊరేగింపును ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జేఈఓ పేర్కొన్నారు. ఈ ఊరేగింపులో సుమారు 60 కళాబృందాలు పాల్గొననున్న నేపథ్యంలో భక్తులకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాన్ని తీర్చిదిద్దాలన్నారు. కోమలమ్మ సత్రం నుంచి ట్రయల్ రన్ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలిపిరి నుంచి తిరుచానూరు ఆలయం వరకు రహదారుల మరమ్మతులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని పూర్తి చేయాలన్నారు. ఊరేగింపు మార్గంలో మామిడి తోరణాలు, అరటి చెట్లు, పందిళ్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో అలంకరణ చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు అనౌన్స్‌మెంట్లు, బ్రాడ్‌కాస్టింగ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం
బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే ప్రధాన వాహన సేవలు, ముఖ్య కార్యక్రమాలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జేఈఓ ఆదేశించారు. ఉత్సవాల ఆహ్వాన పత్రికలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. భక్తులకు పారిశుధ్యం, వైద్యం, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అన్ని విభాగాలు నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి, శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను భక్తులకు చిరస్మరణీయమైన ఆధ్యాత్మిక వేడుకగా నిర్వహించేందుకు కృషి చేయాలని జేఈఓ స్పష్టం చేశారు. సమీక్షలో సీఈ మనోహరం, ఎస్ఈలు వేంకటేశ్వర్లు, మల్లికార్జున ప్రసాద్, వీజీవో గిరిధర, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, గోశాల డైరెక్టర్ డా. శివకుమార్, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్ కుసుమ కుమారి, అదనపు హెల్త్ ఆఫీసర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!





