త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Agra Train Body Parts | ఎర్ర సూట్‌కేసు మిస్టరీ.. చెన్నైలోని ఆ ఇంట్లో దారుణం.. బిర్యానీ వండే పాత్రలో మహిళ శరీర భాగాలు

ఆగ్రా రైలులో దొరికిన ఎర్ర సూట్‌కేసు మిస్టరీ వీడుతోంది. ఈ దారుణం చెన్నైలోని ఓ ఇంట్లో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. బిర్యానీ పాత్రలో అవయవాలు చూసి షాక్!

J

Crime | Published On Aug 23, 2026, 2.44 pm IST

Agra Train Body Parts | ఎర్ర సూట్‌కేసు మిస్టరీ.. చెన్నైలోని ఆ ఇంట్లో దారుణం.. బిర్యానీ వండే పాత్రలో మహిళ శరీర భాగాలు

సంక్షిప్త సారాంశం

ఆగస్టు 6న ఆగ్రా రైల్వే స్టేషన్‌లో తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లోని ఓ ఎర్ర సూట్‌కేసులో మహిళ శరీర భాగాలు లభ్యమయ్యాయి. సూట్‌కేసులోని ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ సాయంతో పోలీసులు ఈ కేసును చెన్నైలోని గూడువాంచేరికి ట్రేస్ చేశారు. ఓ అద్దె ఇంట్లో మహిళను హత్య చేసి, కొన్ని శరీర భాగాలను బిర్యానీ పాత్రలో దాచినట్లు గుర్తించారు. ఆ సూట్‌కేసుతో రైల్వే స్టేషన్‌కు వచ్చిన జంట కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Advertisement

Agra Train Body Parts | త్రినేత్ర.న్యూస్ : ఆగ్రాలో (Agra) రైలులో దొరికిన ఎర్ర సూట్‌కేసు మిస్టరీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆగస్టు 6న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో బయటపడిన ఓ గుర్తుతెలియని మహిళ శరీర భాగాల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చెన్నైకి (Chennai) చేరుకున్నారు. అక్కడ నిందితులు అద్దెకు తీసుకున్న ఇంట్లో జరిగిన దారుణాలను చూసి పోలీసులే కంగుతిన్నారు.

బిర్యానీ పాత్రలో అవయవాలు

ఈ కేసులో వెలుగుచూసిన వివరాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. చెన్నైలోని గూడువాంచేరి ప్రాంతంలో అనుమానితులు అద్దెకు తీసుకున్న ఇంట్లోనే ఈ దారుణ హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బాధితురాలిని దారుణంగా చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే.. ఆమె శరీరంలోని కొన్ని భాగాలను ఇంట్లో బిర్యానీ వండే పెద్ద పాత్రలో (Biryani vessel) దాచి ఉంచారు.

సీసీటీవీలో దొరికిన క్లూ

ఆగస్టు 6న ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా ఉన్న ఎర్ర సూట్‌కేసును తెరిచి చూడగా అందులో కుళ్లిపోయిన శరీర భాగాలు కనిపించాయి. అయితే ఆ సూట్‌కేసులో 'చెన్నై' అని రాసి ఉన్న ఓ పాలిథిన్ కవర్ దొరకడం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. వెంటనే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ (CCTV) కెమెరాలను పరిశీలించగా.. ఓ మహిళ, పురుషుడు కలిసి ఆ సూట్‌కేసును రైలులోకి ఎక్కిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ తర్వాత వారిని గూడువాంచేరిలోని అద్దె ఇంటి ద్వారా ట్రేస్ చేశారు.

మిస్సింగ్ కేసులపై ఆరా

ప్రస్తుతం ఆ అద్దె ఇంటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, వంట పాత్రను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. సూట్‌కేసుతో వెళ్లిన ఆ జంట ఎవరు? మృతురాలితో వారికి ఉన్న సంబంధం ఏంటి? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలిని గుర్తించేందుకు స్థానికంగా నమోదైన మిస్సింగ్ కేసుల (Missing cases) వివరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపగా, రిపోర్ట్ వస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

నిందితులు దొరికితేనే ఈ మర్డర్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది తెలిసే అవకాశం ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement