Saving LPG | గ్యాస్ కొరతలో ఎల్పీజీ సేవ్ చేయాలా? ఈ 6 కిచెన్ టిప్స్ తప్పక తెలుసుకోండి..
Saving LPG | దేశంలోని ఎక్కువ ఇళ్లలో రోజువారీ వంటకు ఎల్పీజీ సిలిండర్లు ఎంతో కీలకం. అయితే ప్రస్తుతం ఎల్పీజీ సరఫరాలో కొరత నెలకొనడంతో చాలా కుటుంబాలు రోజువారీ వంటల నిర్వహణపై ఆందోళన చెందుతున్నాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని స్మార్ట్, ప్రాక్టికల్ కుకింగ్ అలవాట్లను పాటిస్తే గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.
Saving LPG | దేశంలోని ఎక్కువ ఇళ్లలో రోజువారీ వంటకు ఎల్పీజీ సిలిండర్లు ఎంతో కీలకం. అయితే ప్రస్తుతం ఎల్పీజీ సరఫరాలో కొరత నెలకొనడంతో చాలా కుటుంబాలు రోజువారీ వంటల నిర్వహణపై ఆందోళన చెందుతున్నాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని స్మార్ట్, ప్రాక్టికల్ కుకింగ్ అలవాట్లను పాటిస్తే గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. కొద్దిపాటి ప్లానింగ్‌తోనే రుచికరమైన వంటలు చేస్తూనే ఎల్పీజీ సిలిండర్ ను ఎక్కువ రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో వంటగ్యాస్ సేవ్ చేయడానికి ఉపయోగపడే కొన్ని సులభమైన, ప్రభావవంతమైన చిట్కాలను నిపుణులు వివరిస్తున్నారు. గ్యాస్ కొరత సమయంలో త్వరగా ఉడికే వంటకాలను ఎంచుకోవడం మంచిది. రాజ్మా, చోలే వంటి వంటకాలు మెత్తబడటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల ఇవి ఎక్కువ గ్యాస్ వినియోగిస్తాయి. కూరగాయలు లేదా పప్పుతో పోలిస్తే వీటి కుకింగ్ టైమ్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ రాజ్మా లేదా చోలే వండాల్సి వస్తే ముందురోజు రాత్రే నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా మెత్తబడతాయి. దీంతో వంట సమయం తగ్గి గ్యాస్ సేవ్ అవుతుంది. అలాగే ప్రెజర్ కుకర్ ఉపయోగిస్తే మరింత వేగంగా ఉడుకుతాయి.
ఆవిరిపై వండాలి..
వంట మొదలుపెట్టే ముందు అన్ని పదార్థాలు సిద్ధంగా పెట్టుకోండి. గ్యాస్ సేవ్ చేయడానికి సులభమైన మార్గాల్లో ఇది ఒకటి. స్టౌ ఆన్ చేసే ముందు కూరగాయలు కట్ చేసుకోవడం, మసాలాలు కొలిచి సిద్ధం పెట్టుకోవడం, అవసరమైన వస్తువులన్నీ దగ్గరలో ఉంచుకోవడం మంచిది. ఇలా చేస్తే అనవసరంగా గ్యాస్ వృథా కాకుండా వంట త్వరగా పూర్తవుతుంది. వంట సమయంలో పాన్ లేదా కడాయిపై మూత పెట్టడం వల్ల వేడి, ఆవిరి బయటకు పోకుండా లోపలే ఉంటుంది. దీంతో ఆహారం త్వరగా, సమంగా ఉడుకుతుంది. దాల్, అన్నం లేదా కూరగాయలు ఏవైనా సరే మూత పెట్టి వండితే గ్యాస్ వినియోగం తగ్గుతుంది. ఆవిరి వల్ల ఆహారం వేగంగా ఉడుకుతుంది. కాబట్టి బర్నర్ ఎక్కువసేపు ఆన్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. గుడ్లు లేదా అన్నం ఉడికించే సమయంలో పూర్తిగా ఉడికే ముందు కొద్దిసేపటికే గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి ఉంచవచ్చు. మిగిలిన వేడి, ఆవిరి ఆహారాన్ని పూర్తిగా ఉడికిస్తాయి. ఈ చిన్న అలవాటు రోజువారీ గ్యాస్ వినియోగంలో గణనీయమైన మార్పు తీసుకువస్తుంది.
ప్రెజర్ కుక్కర్‌ను వాడాలి..
ప్రెజర్ కుకర్.. గ్యాస్‌ను ఆదా చేసే అత్యుత్తమ కిచెన్ పరికరాల్లో ఒకటి. ఇది ఆవిరి, ప్రెజర్ సహాయంతో ఆహారాన్ని త్వరగా ఉడికిస్తుంది. దీంతో సమయంతోపాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. ఒకేసారి బహుళ వంటకాలు కూడా చేయవచ్చు. ఉదాహరణకు కింద అన్నం ఉడికిస్తూ పై భాగంలో చిన్న గిన్నెలో పప్పు ఉడికించవచ్చు. ఇలా ఒకే మంటను సమర్థంగా ఉపయోగించుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో గ్రేవీ లేదా మసాలా బేస్ తయారు చేసుకోవడం వల్ల గ్యాస్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఈ బేస్‌ను నాలుగు నుంచి ఐదు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. తర్వాత కూరగాయలు, పనీర్ లేదా పప్పు దినుసులను తేలికగా ఉడికించి ముందే సిద్ధం చేసిన మసాలాలో కలిపేస్తే సరిపోతుంది. దీంతో ప్రతిరోజూ ఎక్కువసేపు వంట చేయాల్సిన అవసరం ఉండదు. గ్యాస్ సేవ్ చేయడం అంటే రుచిని లేదా వంటల వైవిధ్యాన్ని తగ్గించడం కాదు. చిన్న చిన్న మార్పులు, సరైన ప్లానింగ్‌తో ఎల్పీజీ వినియోగాన్ని సమర్థంగా నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా గ్యాస్ కొరత సమయంలో ఈ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి.
తాజావార్తలు
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?



