త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mukesh Ambani Reliance Shares Down | ట్రంప్ ఎఫెక్ట్‌తో కుప్పకూలిన రిలయన్స్ షేర్లు.. అంబానీకి లక్ష కోట్లు లాస్

అది పచ్చి అబద్ధం అని జామ్‌నగర్ ఫ్యాక్టరీకి గత మూడు వారాలుగా రష్యా నుంచి ఏ కార్గో నౌక రాలేదని రిలయన్స్ ప్రకటించింది. జనవరిలో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్‌ని దిగుమతి చేసుకోవట్లేదని స్పష్టం చేసింది.

J

Business | Published On Jan 6, 2026, 6.12 pm IST

Mukesh Ambani Reliance Shares Down | ట్రంప్ ఎఫెక్ట్‌తో కుప్పకూలిన రిలయన్స్ షేర్లు.. అంబానీకి లక్ష కోట్లు లాస్
Advertisement

Mukesh Ambani Reliance Shares Down |ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మంగళవారం కుప్పకూలాయి. దాదాపు 5 శాతం వరకు షేర్లు నష్టపోవడంతో ఆయన సంపద క్షణాల్లో ఆవిరైంది. ప్రస్తుతం యూఎస్-వెనిజులా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రిలయన్స్ షేర్లు నష్టపోవడం గమనార్హం. నిజానికి రిలయన్స్ కంపెనీ చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవద్దంటూ యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ కొన్ని రోజుల నుంచి భారత్‌ను ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. రష్యా నుంచి ఆయిల్‌ని దిగుమతి చేసుకుంటే టారిఫ్ ఇంకా పెంచుతా అంటూ ట్రంప్ బెదిరిస్తున్నారు. ఈనేపథ్యంలో రష్యా నుంచి మూడు నౌకల్లో చమురు ఆయిల్ భారత్‌లోని రిలయన్స్ కంపెనీ రిఫైనరీ ఫ్యాక్టరీ ఉన్న జామ్‌నగర్‌కి వస్తున్నాయని పలు మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ మీడియా కథనాలను ముకేష్ అంబానీ కొట్టిపారేశారు.

అది పచ్చి అబద్ధం

అది పచ్చి అబద్ధం అని జామ్‌నగర్ ఫ్యాక్టరీకి గత మూడు వారాలుగా రష్యా నుంచి ఏ కార్గో నౌక రాలేదని రిలయన్స్ ప్రకటించింది. జనవరిలో రష్యా నుంచి క్రూడ్ ఆయిల్‌ని దిగుమతి చేసుకోవట్లేదని స్పష్టం చేసింది. ఆ ప్రకటనలో మంగళవారం రిలయన్స్ షేర్లు కుప్పకూలాయి. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌(ఎన్ఎస్ఈ)లో 4.39 శాతం మేర రిలయన్స్ షేర్ నష్టపోయింది.

ఒక్క రోజే షేర్‌కి రూ.70 నష్టం

రిలయన్స్ ఒక షేరు సోమవారం వరకు రూ.1578 ఉండగా.. మంగళవారం ఉదయం నుంచి డ్రాప్ అవుతూ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1508 కి చేరుకుంది. ఒక్క షేరు మీద సుమారు రూ.70 నష్టపోవడంతో రూ.21.34 లక్షల కోట్లు ఉన్న రిలయన్స్ మార్కెట్ వాల్యూ కాస్త రూ.20.42 లక్షల కోట్లకు పడిపోవడంతో ముకేష్ అంబానీ కంపెనీ రిలయన్స్‌కి ఒక్క రోజులోనే లక్ష కోట్ల నష్టం వాటిల్లింది.

Advertisement

తాజావార్తలు

Advertisement