Nestle India | మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు.. స్పందించిన నెస్లే ఇండియా
Nestle India | ప్రముఖ మ్యాగీ నూడుల్స్ నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది. ముంబయిలోని కళ్యాణ్‌కు చెందిన ఓ వినియోగదారుడు మ్యాగీ ప్యాకెట్‌లో పురుగులు, కీటకాలు ఉన్నాయని ఆరోపించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నూడుల్స్ వండుతున్న సమయంలో ఇవి కనిపించాయని సదరు వినియోగదారు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.
Nestle India | ప్రముఖ మ్యాగీ నూడుల్స్ నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది. ముంబయిలోని కళ్యాణ్‌కు చెందిన ఓ వినియోగదారుడు మ్యాగీ ప్యాకెట్‌లో పురుగులు, కీటకాలు ఉన్నాయని ఆరోపించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నూడుల్స్ వండుతున్న సమయంలో ఇవి కనిపించాయని సదరు వినియోగదారు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. తాను కొనుగోలు చేసిన మ్యాగీ ప్యాకెట్‌పై 2027 ఫిబ్రవరి వరకు గడువు ఉందని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. దీంతో గడువు ముగియకముందే ఉత్పత్తిలో పురుగులు ఎలా వచ్చాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనతో ప్యాకేజ్డ్ ఫుడ్ ఉత్పత్తుల నాణ్యత, భద్రతపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) దృష్టి సారించి.. సంబంధిత ఉత్పత్తి నమూనాలను సేకరించి ల్యాబొరేటరీలో పరీక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఆరోపణలు నిజమా? కాదా? అనేది పరీక్షల తర్వాతే తేలనుంది.
నెస్లే ఇండియా ఏమందంటే..
ఈ వ్యవహారంపై మీడియా కథనాల ద్వారా తెలుసుకున్నామని నెస్లే ఇండియా తెలిపింది. అయితే, ఇప్పటివరకు సంబంధిత వినియోగదారుడు, అధికారులు గానీ తమను సంప్రదించలేదని పేర్కొంది. ఆరోపణల్లో నిజమెంతో ప్రస్తుత దశలో వ్యాఖ్యానించలేమని నెస్లే ఇండియా ప్రతినిధి తెలిపారు. తమ ఉత్పత్తుల తయారీలో కఠినమైన నాణ్యత నియంత్రణ, ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. ముడి పదార్థాల సేకరణ నుంచి తయారీ, ప్యాకేజింగ్ వరకు ప్రతి దశలో పలు నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. అన్ని నాణ్యత, ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే వాటిని మార్కెట్‌లోకి పంపుతామని స్పష్టం చేసింది. కాగా, ఈ ఆరోపణలపై అధికారికంగా నమూనాల పరీక్ష జరిగితేనే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Virat Kohli | కోహ్లీ మరో చరిత్ర.. వన్డేల్లో 15 వేల పరుగులు.. సచిన్ రికార్డుపైనే కన్ను..!
- ●Pink Power Run 3.0 | నెక్లెస్ రోడ్డుపై 35 వేల మందితో పరుగుల పండగ: రొమ్ము క్యాన్సర్‌పై పోరుకు హైదరాబాద్ పింక్ పవర్ రన్ 3.0
- ●Boeing 737 Max | బోయింగ్ 737 మ్యాక్స్‌లో సాఫ్ట్వేర్ లోపం
- ●Tollywood | ప్రభాస్ బర్త్‌డేకు థియేటర్లలోకి రోమియో జూలియట్
- ●Fake Notes | మార్కెట్‌లోకి 500 రూపాయల నకిలీ నోట్లొచ్చేశాయ్.. బీ కేర్ ఫుల్
- ●Malayalam OTT | 25 కోట్ల బడ్జెట్ - 325 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి మమితాబైజు మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ

Virat Kohli | కోహ్లీ మరో చరిత్ర.. వన్డేల్లో 15 వేల పరుగులు.. సచిన్ రికార్డుపైనే కన్ను..!

Pink Power Run 3.0 | నెక్లెస్ రోడ్డుపై 35 వేల మందితో పరుగుల పండగ: రొమ్ము క్యాన్సర్‌పై పోరుకు హైదరాబాద్ పింక్ పవర్ రన్ 3.0

Boeing 737 Max | బోయింగ్ 737 మ్యాక్స్‌లో సాఫ్ట్వేర్ లోపం

Tollywood | ప్రభాస్ బర్త్‌డేకు థియేటర్లలోకి రోమియో జూలియట్



