త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IRDAI | బీమా నిబంధనల్లో మార్పులు.. డిసెంబర్‌లో ఐఆర్‌డీఏఐ కీలక ప్రకటన..

IRDAI | బీమా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ప్రతిపాదించిన కొత్త నిబంధనల్లో పరిశ్రమ వర్గాల అభిప్రాయాల మేరకు మార్పులు చేయాలని ఐఆర్‌డీఏఐ నిర్ణయించింది. సవరించిన నిబంధనల ముసాయిదాను డిసెంబర్ మధ్య నాటికి విడుదల చేయాలని యోచిస్తోంది. తుది నిర్ణయానికి ముందు ఈ ముసాయిదాపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనుంది.

S

Business | Published On Nov 13, 2026, 5.42 pm IST

IRDAI | బీమా నిబంధనల్లో మార్పులు.. డిసెంబర్‌లో ఐఆర్‌డీఏఐ కీలక ప్రకటన..
Advertisement

IRDAI | బీమా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ప్రతిపాదించిన కొత్త నిబంధనల్లో పరిశ్రమ వర్గాల అభిప్రాయాల మేరకు మార్పులు చేయాలని ఐఆర్‌డీఏఐ నిర్ణయించింది. సవరించిన నిబంధనల ముసాయిదాను డిసెంబర్ మధ్య నాటికి విడుదల చేయాలని యోచిస్తోంది. తుది నిర్ణయానికి ముందు ఈ ముసాయిదాపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనుంది.

బీమా నిబంధ‌న‌ల్లో రానున్న కీల‌క మార్పులు..

భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) బీమా పంపిణీ నిబంధనల్లో సమగ్ర మార్పులకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పరిశ్రమలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించి ప్రతిపాదిత నిబంధనల్లో మార్పులు చేయాలని భావిస్తోంది. డిసెంబర్ మధ్య నాటికి సవరించిన నిబంధనలపై ఎక్స్‌పోజర్ డ్రాఫ్ట్‌ను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత‌ వర్గాలు వెల్లడించాయి. ఇది తుది నిబంధనల ముసాయిదా కాదని, ప్రజల పరిశీలన కోసం విడుదల చేసే సవరించిన ప్రతిపాదన మాత్రమేనని స్పష్టం చేశాయి. సెప్టెంబర్ 23న ఐఆర్‌డీఏఐ విడుదల చేసిన రీకాలిబ్రేటింగ్ ఎకనామిక్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ కన్సల్టేషన్ పేపర్‌లో ఈ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి.

క‌మీష‌న్ల ప‌రిమితుల‌పై అభ్యంత‌రాలు..

ప్రతిపాదనల్లో భాగంగా బీమా ఉత్పత్తులు, పంపిణీ మార్గాలను బట్టి కమీషన్లపై పరిమితులు విధించడం, బీమా సంస్థల నిర్వహణ వ్యయ పరిమితులను దశలవారీగా తగ్గించడం, బీమా పంపిణీ వ్యవస్థను మూడు విభాగాలుగా సరళీకరించడం వంటి అంశాలను ఐఆర్‌డీఏఐ సూచించింది. అయితే ఈ ప్రతిపాదనలపై బీమా మధ్యవర్తులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మార్పుల వల్ల 10 లక్షలకు పైగా జీవనోపాధులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇండియన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని కూడా కోరింది. పంపిణీ వ్యయాలు తగ్గించడం వల్ల పాలసీదారులకు తప్పనిసరిగా మెరుగైన ప్రయోజనాలు లభిస్తాయా? అనే సందేహాలను బీమా బ్రోకర్లు వ్యక్తం చేశారు. దీంతో అభిప్రాయాలు సమర్పించేందుకు ఇచ్చిన గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించింది. ఈ ప్రక్రియలో ఐఆర్‌డీఏఐకి 650కు పైగా స్పందనలు అందాయి. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్న నియంత్రణ సంస్థ, సవరించిన ముసాయిదాను విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేయనుంది.

Advertisement
Advertisement