త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold, Silver Rates | రూ.30వేలు తగ్గిన వెండి ధర.. బంగారం ఎంతంటే?

Gold, Silver Rates | గ‌రిష్ఠానికి చేరిన‌ బంగారం, వెండి ధ‌ర‌లు (Gold, Silver Rates).. గ‌త కొన్ని రోజులుగా హెచ్చుత‌గ్గుల‌కు లోన‌వుతున్నాయి. బుధ‌వారం స్వ‌ల్పంగా పెరిగిన ధ‌ర‌లు, తాజాగా త‌గ్గాయి.

G

Business | Published On Feb 5, 2026, 1.36 pm IST

Gold, Silver Rates | రూ.30వేలు తగ్గిన వెండి ధర.. బంగారం ఎంతంటే?
Advertisement

Gold, Silver Rates | త్రినేత్ర‌.న్యూస్‌: గ‌రిష్ఠానికి చేరిన‌ బంగారం, వెండి ధ‌ర‌లు (Gold, Silver Rates).. గ‌త కొన్ని రోజులుగా హెచ్చుత‌గ్గుల‌కు లోన‌వుతున్నాయి. బుధ‌వారం స్వ‌ల్పంగా పెరిగిన ధ‌ర‌లు, తాజాగా త‌గ్గాయి. బంగారం 10 గ్రాముల ధ‌ర రూ.6600 ప‌డిపోగా, వెండి ఒక్క‌రోజే రూ.30 వేలు త‌గ్గింది. దీంతో హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,59,680 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,550గా ఉంది.

ఇక, ఆకాశ‌మే హ‌ద్దుగా పెరిగిన‌ వెండి ధర ఇప్పుడు నేల‌చూపులు చూస్తున్న‌ది. గ‌త‌వారం రూ.4 ల‌క్ష‌ల‌కుపైగా ప‌లికి గ‌రిష్ఠస్థాయికి చేరిన కిలో వెండి ధ‌ర ప్ర‌స్తుతం భారీగా పడిపోయింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు రూ.30వేల మేర తగ్గింది. కిలో వెండి ధర రూ.2,69,000గా ఉంది.

 

Advertisement
Advertisement