Gold-Silver Price | అంతర్జాతీయ పరిస్థితులు.. తగ్గిన బంగారం, వెండి ధరలు..!
Gold-Silver Price | అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా డాలర్ ప్రభావం, వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి కారణంగా బంగారం, వెండి ధరలు నాలుగు శాతం వరకు పడిపోయాయి.
Gold-Silver Price | అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా డాలర్ ప్రభావం, వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి కారణంగా బంగారం, వెండి ధరలు నాలుగు శాతం వరకు పడిపోయాయి. కిలో వెండి ధర ఒక్క రోజులోనే రూ.11 వేల మేర తగ్గి రూ.2,65,500కి చేరింది. పది గ్రాముల బంగారం ధర రూ.2 వేల మేర తగ్గి రూ.1,63,200కి చేరింది. ఆల్ ఇండియా సరాఫా ధ్రువీకరించింది. దేశీయ మార్కెట్‌లో బలమైన అమెరికా డాలర్ ప్రభావం, గ్లోబల్ ద్రవ్య విధాన సడలింపులపై మారుతున్న అంచనాలు బంగారం ధరలపై ఒత్తిడి తెచ్చాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్టు దిలీప్ పరమార్ తెలిపారు. ఇరాన్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని, దాని వల్ల ద్రవ్యోల్బణం పెరిగే భయాలు ఉన్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను ఎక్కువ కాలం అదే స్థాయిలో కొనసాగించే అవకాశముందని పేర్కొన్నారు. తాత్కాలికంగా మార్కెట్‌లో అస్థిరత కొనసాగినా, దీర్ఘకాలిక దిశ సానుకూలంగానే ఉండే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ వెండి ధర ఔన్స్‌కు సుమారు ఒక శాతం తగ్గి 83.14 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, బంగారం ధర మాత్రం స్వల్పంగా పెరిగి ఔన్స్‌కు 5,088 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వరుసగా రెండో వారంలో బంగారం ధరలు తగ్గినట్లు చాయిస్ బ్రోకింగ్‌లో కమోడిటీ, కరెన్సీ విశ్లేషకుడు అమీర్ మక్దా తెలిపారు. ప్రస్తుతం బంగారం ఔన్స్‌కు 5,100 డాలర్ల కంటే దిగువన ట్రేడ్ అవుతోందని చెప్పారు. బలమైన అమెరికా డాలర్, పెరుగుతున్న చమురు ధరలు, మధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. అమెరికా ట్రెజరీ బాండ్ల యీల్డ్‌లు పెరగడం కూడా లోహాలపై ఒత్తిడి తెచ్చిందని వివరించారు. ఇదిలా ఉండగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతోంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) తాజా సమావేశ మినిట్స్ ప్రకారం సమీప కాలంలో ద్రవ్య విధాన సడలింపులపై పెద్దగా సంకేతాలు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు అమెరికా ఆర్థిక వృద్ధి గణాంకాలపై నిలిచింది. ఇవే ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై స్పష్టత ఇవ్వనున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Hurricane Lala | హవాయి వైపుగా దూసుకొస్తున్న ‘లాలా’.. 155 ఏళ్ల తర్వాత బిగ్ఐలాండ్ను నేరుగా తాకే ఛాన్స్..!
- ●Weekly Horoscope | ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి!
- ●US shootings | కాల్పులతో దద్దరిల్లిన అమెరికా
- ●Balapur Ganesh | పూరీ జగన్నాథస్వామి ఆలయ నమూనాలో బాలాపూర్ గణేశుడి మండపం
- ●Horoscope | ఆగస్టు 16 రాశి ఫలాలు.. ఈ రాశివారు సృజనాత్మక పనుల్లో విజయం సాధిస్తారు!
- ●Gold Limit in India | ఇంట్లో ఎంత బంగారం పెట్టుకోవచ్చు? పత్రాలు లేకుండా లిమిట్ దాటితే సీజ్ చేస్తారా?

Hurricane Lala | హవాయి వైపుగా దూసుకొస్తున్న ‘లాలా’.. 155 ఏళ్ల తర్వాత బిగ్ఐలాండ్ను నేరుగా తాకే ఛాన్స్..!

Weekly Horoscope | ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి!

US shootings | కాల్పులతో దద్దరిల్లిన అమెరికా

Balapur Ganesh | పూరీ జగన్నాథస్వామి ఆలయ నమూనాలో బాలాపూర్ గణేశుడి మండపం




