త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold-Silver Price | త‌గ్గిన వెండి.. పెరిగిన బంగారం..! హైద‌రాబాద్‌లో నేటి ధ‌ర‌లు ఇవే..!

Gold-Silver Price | వెండి ధ‌ర‌లు కొనుగోలుదారుల‌కు స్వ‌ల్ప ఊర‌ట‌నిచ్చింది. సోమ‌వారం దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో వెండి ధ‌ర 2శాతం త‌గ్గి కిలోకు రూ.2.5ల‌క్ష‌ల‌కు చేరుకుంది. అదే స‌మ‌యంలో బంగారం ధ‌ర స్వ‌ల్పంగా పెరిగింది.

P

Business | Published On Feb 16, 2026, 8.55 pm IST

Gold-Silver Price | త‌గ్గిన వెండి.. పెరిగిన బంగారం..! హైద‌రాబాద్‌లో నేటి ధ‌ర‌లు ఇవే..!
Advertisement

Gold-Silver Price | వెండి ధ‌ర‌లు కొనుగోలుదారుల‌కు స్వ‌ల్ప ఊర‌ట‌నిచ్చింది. సోమ‌వారం దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో వెండి ధ‌ర 2శాతం త‌గ్గి కిలోకు రూ.2.5ల‌క్ష‌ల‌కు చేరుకుంది. అదే స‌మ‌యంలో బంగారం ధ‌ర స్వ‌ల్పంగా పెరిగింది. రూ.700 పెరిగి తులం ధ‌ర రూ.1,59,200 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీక‌రించింది. గ‌త శుక్ర‌వారం కిలోకు రూ.2.55ల‌క్ష‌లు ప‌లికిన వెండి సోమ‌వారం 5వేలు త‌గ్గి కిలోకు రూ.2.50ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో వెండి దాదాపు ఒక‌శాతం త‌గ్గి ఔన్స్‌కు 76.94 డాల‌ర్ల‌కు చేరుకుంది.

అలాగే, గోల్డ్ ఔన్సుకు 40.10 డాల‌ర్లు తగ్గి 5,003.01కి త‌గ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో సీనియర్ కమోడిటీ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ మాట్లాడుతూ.. డాల‌ర్ స్వ‌ల్పంగా బ‌ల‌ప‌డ‌డం, ఆ త‌ర్వాత కొనుగోళ్ల ఒత్తిడి లేక‌పోవ‌డంతో బంగారంపై ప్ర‌భావం చూపింద‌న్నారు. చైనా మార్కెట్లు మూసి ఉండ‌డం వ‌ల్ల ట్రేడింగ్ కార్య‌క‌లాపాలు నెమ్మ‌దించాయ‌ని ఆయ‌న వివ‌రించారు. హైద‌రాబాద్‌లో బంగారం ధ‌ర‌ల విష‌యానికి వ‌స్తే 24 క్యారెట్స్ గోల్డ్ రూ.1,56,440 ఉండ‌గా.. 22 క్యారెట్ల ప‌సిడి రూ.1,43,400 ప‌లుకుతున్న‌ది. ఇక వెండి కిలోకు రూ.2.65ల‌క్ష‌ల వ‌ద్ద ట్రేడ‌వుతున్న‌ది.

Advertisement
Advertisement