Gold Rate | బంగారం కొనుగోలుదారులకు తీపికబురు.. ఒకేరోజు రూ.2500 డౌన్..!
Gold Rate | కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరలు భారీ ఊరటనిస్తున్నాయి. వరుసగా నాలుగో సెషన్‌లో ధరలు భారీగా పతనమయ్యాయి. దీపావళి తర్వాత దేశీయంగా కొనుగోళ్లు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి.
- వెండి కిలోకు రూ.3,500 పతనం
- దీపావళి తర్వాత తగ్గిన కొనుగోళ్లు..
- అంతర్జాతీయ పరిణామాల ప్రభావం కూడా..
- బలపడిన డాలర్, అమెరికా బాండ్ల రాబడులతో పెరిగిన ఒత్తిడి
Gold Rate | కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరలు భారీ ఊరటనిస్తున్నాయి. వరుసగా నాలుగో సెషన్‌లో ధరలు భారీగా పతనమయ్యాయి. దీపావళి తర్వాత దేశీయంగా కొనుగోళ్లు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.2,500 తగ్గి రూ.1,40,900కు చేరింది. గురువారం ఈ ధర రూ.1,43,400గా ఉంది. వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. కిలో వెండిపై రూ.3,500 తగ్గడంతో ధర రూ.1,84,000కు చేరింది. అంతకుముందు సెషన్‌లో కిలో వెండి ధర రూ.1,87,500 వద్ద స్థిరంగా ఉంది. దీపావళి తర్వాత రిటైల్ డిమాండ్ తగ్గడంతో దేశీయ మార్కెట్లో పసిడిపై ఒత్తిడి పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఇలా..
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ మాత్రం స్వల్పంగా పుంజుకుంది. ఔన్సుకు 27.21 డాలర్లు (సుమారు ఒక శాతం) పెరిగి 3,904.87 డాలర్లకు చేరింది. అంతకుముందు సెషన్‌లో 3 శాతం పతనమై 3,877.52 డాలర్ల వద్ద ముగిసింది. కీలకమైన 4,000 డాలర్ల స్థాయిని కూడా కోల్పోయింది. మరోవైపు స్పాట్ వెండి ఔన్సుకు 50.04 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగింది. అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు పెరగడం, డాలర్ బలోపేతం కావడం విలువైన లోహాలపై ఒత్తిడి పెంచుతున్నాయని జియోటస్ డాట్‌కామ్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పరిణామాలు, పెట్టుబడిదారుల రిస్క్ తీసుకునే ధోరణిలో మార్పులు కూడా వెండి ధరల పతనానికి కారణమవుతున్నాయన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో ఇరాన్‌తో తక్షణ దౌత్యపరమైన ఒప్పందంపై ఆశలు సన్నగిల్లడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపిందని వివరించారు.
ఒడిదుడుకులేనా?
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలైన ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (పీపీఐ), కోర్ పీపీఐపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. వీటి ఆధారంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే అంచనాలు మార్కెట్ దిశను ప్రభావితం చేయనున్నాయి. డాలర్ కదలికలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది అభిప్రాయపడ్డారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!





