త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

23 Dec 2025 Gold and Silver Rates | గోల్డ్ కొనే ప్లాన్ ఉందా? ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి

ఇక వెండి ధరలు చూసుకుంటే మంగళవారం ఒక గ్రాము వెండి ధర రూ.234 కాగా, ఒక కిలో వెండి ధర రూ.2,34,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే వెండి ధర కిలోకి ఇవాళ రూ.3000 పెరిగింది.

J

Business | Published On Dec 23, 2025, 10.22 am IST

23 Dec 2025 Gold and Silver Rates | గోల్డ్ కొనే ప్లాన్ ఉందా? ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి
Advertisement

23 Dec 2025 Gold and Silver Rates | బంగారం, వెండి ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారం కంటే కూడా వెండి ధరలు ఇంకా భగ్గుమంటున్నాయి. చలికాలంలో ఈ ధరలు భగ్గుమంటున్నాయి. అందుకే గోల్డ్ కొనాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. వెండి జోలికి కూడా పోవడం లేదు. రోజురోజుకూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు అయినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో గోల్డ్ కొనాల్సి వస్తోంది.

ఇవాళ 23 డిసెంబర్ 2025, మంగళవారం బంగారం ధరలు చూస్తే, 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.13855 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.12700 గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.10391 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపుగా ధరలు ఒకేవిధంగా ఉన్నాయి. నిన్నటి ధరలతో పోల్చితే ఒక గ్రాము మీద సుమారు రూ.200 బంగారం ధర పెరిగింది.

23 Dec 2025 Gold and Silver Rates | వెండి ధరలు ఎలా ఉన్నాయి?

ఇక వెండి ధరలు చూసుకుంటే మంగళవారం ఒక గ్రాము వెండి ధర రూ.234 కాగా, ఒక కిలో వెండి ధర రూ.2,34,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే వెండి ధర కిలోకి ఇవాళ రూ.3000 పెరిగింది. వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే వెండి ధర కిలోకు రూ.3 లక్షలకు తాకే చాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement