Vespa Tech 80th Special Edition | 1940ల డిజైన్‌తో వచ్చిన కొత్త వెస్పా స్కూటర్.. రెండు వేరియెంట్లలో విడుదల..
Vespa Tech 80th Special Edition | ఇటలీకి చెందిన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ వెస్పా తన 80వ వార్షికోత్సవం సందర్భంగా భారత్‌లో టెక్ 80వ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. వారసత్వ డిజైన్‌ను ఆధునిక టెక్నాలజీతో కలిపిన ఈ ప్రత్యేక మోడల్ ను స్టైలిష్, ప్రీమియం అర్బన్ ప్రయాణాన్ని కోరుకునే రైడర్లను దృష్టిలో ఉంచుకుని లాంచ్ చేశారు.
Automobiles | Published On Apr 24, 2026, 3.27 pm IST
Vespa Tech 80th Special Edition | ఇటలీకి చెందిన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ వెస్పా తన 80వ వార్షికోత్సవం సందర్భంగా భారత్‌లో టెక్ 80వ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. వారసత్వ డిజైన్‌ను ఆధునిక టెక్నాలజీతో కలిపిన ఈ ప్రత్యేక మోడల్ ను స్టైలిష్, ప్రీమియం అర్బన్ ప్రయాణాన్ని కోరుకునే రైడర్లను దృష్టిలో ఉంచుకుని లాంచ్ చేశారు. ఈ స్కూటర్ 125 సీసీ, 150 సీసీ ఇంజిన్ ఆప్షన్లలో లాంచ్ అయింది. ఇది వెర్డే పాస్టెల్లో గ్రీన్ కలర్ ను ప్రత్యేకంగా కలిగి ఉంది. 1940లలో వచ్చిన ప్రారంభ వెస్పా మోడల్స్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ మోడల్‌ను డిజైన్ చేశారు. ఈ కలర్ ఆప్షన్ కలిగిన స్కూటర్లో బాడీతోపాటు ఫ్రంట్ షీల్డ్ ట్రిమ్, గ్రాబ్ హ్యాండిల్, మిర్రర్లు, స్విచ్ గేర్, ఫ్రంట్ సస్పెన్షన్ లింకేజీ వంటి భాగాల్లోనూ క్లాసిక్ లుక్‌ను కలిగి ఉంటుంది. అలాగే సీటు అప్ హోల్స్టరీ, ఫుట్‌రెస్ట్ ఇన్సర్ట్స్, హ్యాండిల్‌బార్ గ్రిప్స్పై డార్క్ గ్రీన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ముందు వైపు ప్రత్యేకంగా 80th బ్రాండింగ్..
1946లో వచ్చిన అసలు మోడల్‌ను పోలిన విధంగా దీన్ని రూపొందించారు. ఈ స్కూటర్ వీల్స్‌ను వెస్పా 98 స్టైల్లో డిజైన్ చేశారు. అలాగే అదే గ్రీన్ షేడ్‌తో డైమండ్ కట్ ఫినిషింగ్ ఇచ్చారు. ముందు భాగంలో వెస్పా లోగో పక్కన 80th అనే బ్యాడ్జ్‌ను ఉంచారు. వెనుక వైపు 80 ఇయర్స్ ఆఫ్ వెస్టా ఎస్ట్. 1946 అనే ప్రత్యేక సింబల్‌ను ఇచ్చారు. దీన్ని ఈ లిమిటెడ్ ఎడిషన్‌కు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. ఈ స్కూటర్ వారసత్వ డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ అధునాతన ఫీచర్లను ఇందులో ఇచ్చారు. 125సీసీ వేరియెంట్లో 124.4 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది 9.5 హార్స్పవర్, 0.1 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 150 సీసీ వేరియంట్లో 149.5 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. 11.4 హార్స్పవర్, 11.6 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. రెండు వేరియంట్లూ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి. ఇది నగర ప్రయాణాలకు అనువైన సాఫ్ట్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
వచ్చే వారం మార్కెట్లోకి..
ఈ ప్రత్యేక ఎడిషన్‌కు సంబంధించిన పూర్తి ఫీచర్ల జాబితా, ధరలను వెస్పా ఇంకా ప్రకటించలేదు. అయితే వచ్చే వారం ఈ వివరాలు వెల్లడించనున్నట్లు కంపెనీ తెలిపింది. బ్రాండ్ ప్రీమియం ఇమేజ్, మోడల్ ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుంటే, ఇది సాధారణ వెస్పా మోడళ్ల కంటే ఎక్కువ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిజైన్, ప్రత్యేకత, బ్రాండ్ వారసత్వాన్ని విలువైనదిగా భావించే వినియోగదారులను ఈ మోడల్ ఆకర్షిస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



