MG Hector | ఎంజీ హెక్టర్‌లో కొత్త స్టార్మ్ సిరీస్.. బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ వచ్చేశాయ్..
MG Hector | జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన హెక్టర్ ఎస్‌యూవీలో స్టార్మ్ సిరీస్‌ను మళ్లీ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ పేర్లతో రెండు పరిమిత ఎడిషన్ మోడళ్లను పరిచయం చేసింది. ఈ రెండు ఎస్‌యూవీల ధరను ఎక్స్‌షోరూమ్ ప్రకారం రూ.19,99,800గా నిర్ణయించారు. ఇవి కేవలం ఐదు సీట్ల కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లభిస్తాయి.
Automobiles | Published On Oct 8, 2026, 5.38 pm IST
MG Hector | జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన హెక్టర్ ఎస్‌యూవీలో స్టార్మ్ సిరీస్‌ను మళ్లీ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ పేర్లతో రెండు పరిమిత ఎడిషన్ మోడళ్లను పరిచయం చేసింది. ఈ రెండు ఎస్‌యూవీల ధరను ఎక్స్‌షోరూమ్ ప్రకారం రూ.19,99,800గా నిర్ణయించారు. ఇవి కేవలం ఐదు సీట్ల కాన్ఫిగరేషన్‌లో మాత్రమే లభిస్తాయి. సాధారణ హెక్టర్‌తో పోలిస్తే ప్రధాన మార్పులు ఎక్స్టీరియర్ డిజైన్, కలర్ థీమ్, క్యాబిన్లో కనిపిస్తాయి. మెకానికల్ సెటప్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్ల మధ్య ప్రధాన తేడా ఎక్స్టీరియర్ కలర్ థీమ్. హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ పూర్తిగా బ్లాక్ కలర్ ఎక్స్టీరియర్తో వస్తుంది. స్నోస్టార్మ్ మాత్రం పెర్ల్ వైట్ బాడీతోపాటు స్టార్రీ బ్లాక్ రూఫ్‌ను కలిగి ఉంటుంది. రెండు మోడళ్లలోనూ కొత్త బ్లాక్ స్టార్మ్ హెక్స్ గ్రిల్, మార్పులు చేసిన ఫ్రంట్, రియర్ బంపర్ గార్నిష్‌లు, బ్లాక్ అలాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్లు ఉన్నాయి.
ఫీచర్లు ఇవే..
లోగోలు, స్కిడ్ ప్లేట్లు, టెయిల్‌గేట్ ఎలిమెంట్లు, సైడ్ క్లాడింగ్‌పై డార్క్ క్రోమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. పియానో బ్లాక్ రూఫ్ రైల్స్, బ్లాక్ హెడ్‌ల్యాంప్ సరౌండ్స్, స్మోక్డ్ కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ కూడా ఇందులో ఉన్నాయి. క్యాబిన్లో పూర్తిగా బ్లాక్ థీమ్‌ను ఉపయోగించారు. బ్లాక్ లెదర్ సీట్లతోపాటు, ఆయా ఎడిషన్లకు అనుగుణంగా ముందు హెడ్రెస్టులపై బ్లాక్‌స్టార్మ్ లేదా స్నోస్టార్మ్ ఎంబాసింగ్ ఉంటుంది. స్టీరింగ్ వీల్‌కు లెదర్ ర్యాప్తోపాటు గన్మెటల్ డీటైలింగ్ ఇచ్చారు. ఈ కార్లలో 14 ఇంచుల పోర్ట్రెయిట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఐ-స్వైప్ జెశ్చర్ కంట్రోల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎనిమిది రంగుల యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ పవర్డ్ టెయిల్‌గేట్, ఎయిర్ ప్యూరిఫైయర్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, వీల్ వ్యూతో కూడిన 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఏడీఏఎస్, ఏబీఎస్‌తో ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ వంటి సిస్టమ్స్‌ను అందించారు.
ధర ఎంతంటే..
బ్లాక్‌స్టార్మ్ పూర్తిగా బ్లాక్ ఎక్స్టీరియర్లో లభిస్తుంది. స్నోస్టార్మ్ మాత్రం పెర్ల్ వైట్ బాడీ, స్టార్రీ బ్లాక్ రూఫ్ కలయికతో వస్తుంది. రెండు మోడళ్లతోనూ ప్రత్యేక యాక్సెసరీ ప్యాకేజీ అందిస్తున్నారు. ఇందులో ఎడిషన్‌కు ప్రత్యేకమైన బ్యాడ్జ్‌లు, రెడ్ టెయిల్‌గేట్ డీటైలింగ్, ఫాగ్ ల్యాంప్ యాక్సెంట్స్, ఓఆర్వీఎం ప్రొటెక్టర్లు, సైడ్ స్టెప్స్ ఉన్నాయి. ఈ యాక్సెసరీలను డీలర్షిప్ వద్ద ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా అమర్చుకోవచ్చని ఎంజీ తెలిపింది. ఎంజీ హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ రెండింటి ధర ఎక్స్‌షోరూమ్ ప్రకారం రూ.19,99,800 ఉండగా, ఇవి టాప్ ఎండ్ హెక్టర్‌పై ఆధారపడి ఉంటాయి. సావీ ప్రొ సీవీటీ వేరియంట్‌తో పోలిస్తే ఈ ప్రత్యేక ఎడిషన్లపై సుమారు రూ.35వేల ప్రీమియం ఉంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తోపాటు సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను మాత్రమే అందిస్తున్నారు. ఈ ఇంజిన్ 143 పీఎస్ పవర్, 250 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
టెక్నాలజీ, భద్రతా ఫీచర్లు అవే..
హెక్టర్ స్టార్మ్ సిరీస్ ప్రధానంగా సాధారణ హెక్టర్ కంటే ప్రత్యేకమైన రూపాన్ని కోరుకునే కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంది. ఇంజిన్ లేదా పవర్‌ట్రెయిన్‌లో మార్పులు కోరుకోని వారికి ఈ ప్రత్యేక ఎడిషన్లు మరో ఆప్షన్‌గా నిలుస్తాయి. దూకుడైన పూర్తిగా బ్లాక్ లుక్ కోరుకునేవారికి బ్లాక్‌స్టార్మ్, వైట్ అండ్ బ్లాక్ కాంట్రాస్ట్ డిజైన్ ఇష్టపడేవారికి స్నోస్టార్మ్ ఆకర్షణీయంగా ఉండనున్నాయి. రెండు మోడళ్లలోనూ హెక్టర్‌లో ఇప్పటికే ఉన్న టెక్నాలజీ, భద్రతా ఫీచర్లను కొనసాగించారు.
తాజావార్తలు
- ●Donald Trump | రష్యా నుంచి డీజిల్.. పుతిన్‌తో ట్రంప్ ఒప్పందం.. జెలెన్స్కీ ఆగ్రహం
- ●TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్
- ●High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Donald Trump | రష్యా నుంచి డీజిల్.. పుతిన్‌తో ట్రంప్ ఒప్పందం.. జెలెన్స్కీ ఆగ్రహం

TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్

High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు



