త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mussoorie Homestay Death | హోమ్‌స్టేలో ఘోరం: భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన వైజాగ్ యువతి అనుమానాస్పద మృతి

భర్తతో కలిసి ముస్సోరీ టూర్‌కు వెళ్లిన 27 ఏళ్ల ఢిల్లీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హోమ్‌స్టే గదిలో శవమై తేలింది. రక్తం, మూత్రపు మడుగులో నగ్నంగా పడి ఉన్న ఆమె మృతదేహం చూసి పోలీసులు షాకయ్యారు.

J

Visakhapatnam | Published On Jun 16, 2026, 5.03 pm IST

Mussoorie Homestay Death | హోమ్‌స్టేలో ఘోరం: భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన వైజాగ్ యువతి అనుమానాస్పద మృతి
Advertisement

Mussoorie Homestay Death | త్రినేత్ర.న్యూస్ : భర్తతో కలిసి సరదాగా గడిపేందుకు హిల్ స్టేషన్‌కు వెళ్లిన ఓ తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అక్కడ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో సోమవారం (జూన్ 15) ఉదయం ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హోమ్‌స్టే గదిలో రక్తం, మూత్రపు మడుగులో నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని చూసి స్థానికులు, పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ ప్రాంతానికి చెందిన పి.రాధా గాయత్రి (27), సౌమ్య శ్రీచరణ్‌లకు గతేడాది నవంబర్ 8, 2025న వివాహమైంది. గాయత్రి ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ ఈస్ట్‌లో నివసిస్తూ గుర్గావ్‌లోని ఒక ప్రముఖ ఐటీ (IT) సంస్థలో పనిచేస్తోంది. భర్త శ్రీచరణ్ పుణేలోని మరో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాంగ్ వీకెండ్ లేదా వెకేషన్ ప్లాన్ చేసుకున్న ఈ జంట.. తొలుత ఢిల్లీ నుంచి రిషికేష్ చేరుకుని, ఆ తర్వాత జూన్ 14న అర్ధరాత్రి దాటాక ముస్సోరీలోని 'కియానా హోమ్‌స్టే'కు వచ్చారు. అక్కడ 'బ్లిస్' (Bliss) అనే రూమ్‌లో వీరు చెకిన్ అయ్యారు.

Delhi IT Professional Found Dead in Mussoorie Homestay Under Mysterious Circumstances

భర్త చెప్పిన వివరాలు.. గదిలో దారుణ దృశ్యం

భర్త శ్రీచరణ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం.. రూమ్‌కు వచ్చిన తర్వాత దంపతులిద్దరూ రాత్రి పూట మద్యం సేవించారు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయారు. అయితే, ఉదయం శ్రీచరణ్ నిద్ర లేచి చూసేసరికి గదిలోని దృశ్యం చూసి షాకయ్యాడు. భార్య రాధా గాయత్రి ఒంటిపై నూలుపోగు లేకుండా (నగ్నంగా) నేలపై పడి ఉంది. ఆమె ముక్కులోంచి రక్తం కారుతోంది. చుట్టూ మూత్రం, రక్తం మడుగు ఉంది. ఆమె ఎంత పిలిచినా స్పందించకపోవడంతో కంగారుపడిన భర్త హోమ్‌స్టే యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసుల ఎంట్రీ.. రంగంలోకి క్లూస్ టీమ్

సమాచారం అందుకున్న ముస్సోరీ పోలీసులు 108 అంబులెన్స్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌లో ఉన్న ఫార్మసిస్ట్ ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు గదిని పరిశీలించగా.. మంచంపై ఉన్న బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు కనిపించాయి. గదిలో రెండు ఖాళీ మద్య సీసాలతో పాటు తినుబండారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కెమెరాల నిఘాలో పోస్ట్‌మార్టం

మృతురాలి శరీరంపై ఉన్న గుర్తులు, బెడ్‌షీట్‌పై రక్తం మరకల నేపథ్యంలో పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం (Autopsy) నిమిత్తం డెహ్రాడూన్‌లోని కొరోనేషన్ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఉండేందుకు.. నిపుణులైన వైద్యుల ప్యానెల్‌తో, పూర్తి వీడియో రికార్డింగ్ (కెమెరా నిఘా) మధ్య పోస్ట్‌మార్టం నిర్వహించాలని పోలీసులు ఆసుపత్రి వర్గాలను కోరారు. ఇది మితిమీరిన మద్యం వల్ల జరిగిన ప్రమాదమా లేక దీని వెనుక మరేదైనా కోణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
Advertisement