త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pawan Kalyan Keralam Visit | ‘థాంక్యూ కేరళం’: ఆయుర్వేద చికిత్స ముగిశాక పవన్ కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్.. కేరళ సీఎం ఏమన్నారంటే?

ఆయుర్వేద చికిత్స, ఆలయాల దర్శనం ముగించుకుని కేరళం ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ పవన్ కల్యాణ్ భావోద్వేగ లేఖ రాశారు. దీనికి కేరళం సీఎం స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

J

Andhra pradesh | Published On Sep 13, 2026, 3.23 pm IST

Pawan Kalyan Keralam Visit | ‘థాంక్యూ కేరళం’: ఆయుర్వేద చికిత్స ముగిశాక పవన్ కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్.. కేరళ సీఎం ఏమన్నారంటే?
Advertisement
  • కేరళలోని డాక్టర్ సీతారామ్ ఆయుర్వేదిక్ రిట్రీట్‌లో కొన్ని వారాల పాటు చికిత్స తీసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • చికిత్స సమయంలో గురువాయూర్ శ్రీకృష్ణ, త్రిప్రయార్ శ్రీరామ, మమ్మియూర్, చెట్టికులంగర అమ్మవారి క్షేత్రాలను సందర్శించి ప్రత్యేక పూజలు
  • కేరళ ప్రజల ఆతిథ్యం, సంప్రదాయాలు, సహకరించిన పోలీసు, ప్రభుత్వ యంత్రాంగానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు
  • పవన్ ట్వీట్‌పై కేరళం సీఎం వి.డి.సతీశన్ స్పందిస్తూ.. మీరు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా రీ-ట్వీట్

Pawan Kalyan Keralam Visit | త్రినేత్ర.న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ కేరళంలో తన ఆయుర్వేద చికిత్సను విజయవంతంగా ముగించుకున్నారు. గత కొన్ని వారాలుగా కేరళంలో బస చేసిన ఆయన.. అక్కడి ప్రజల ఆదరణ, వైద్యుల సేవలు, ప్రాచీన ఆలయాల ఆధ్యాత్మిక అనుభూతిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్ట్‌పై కేరళం ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ వెంటనే స్పందిస్తూ ఆత్మీయంగా రీ-ట్వీట్ చేయడం విశేషం.

విశ్రాంతి, చికిత్స కోసం కేరళను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపిన కేరళం సీఎం.. "మా ప్రజల ప్రేమ, ప్రాచీన ఆలయాల దర్శనం మీకు శాంతిని, స్వస్థతను చేకూర్చడం సంతోషకరం. త్వరలోనే మిమ్మల్ని మళ్లీ మా రాష్ట్రానికి ఆహ్వానించాలని ఎదురుచూస్తున్నాం. కేరళం ప్రభుత్వం, ప్రజల తరఫున మీరు సంపూర్ణ ఆరోగ్యంతో వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

ఆయుర్వేద సంరక్షణ, ఆధ్యాత్మిక అనుభూతి

త్రిస్సూర్‌లోని ప్రసిద్ధ డాక్టర్ సీతారామ్ ఆయుర్వేదిక్ రిట్రీట్ వైద్యులు, సిబ్బంది చూపిన అంకితభావం, వృత్తిపరమైన సేవలపై పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. చికిత్స సమయంలో తనకు లభించిన మానసిక ప్రశాంతత ఎంతో గొప్పదని తెలిపారు.

అదే సమయంలో కేరళంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన త్రిప్రయార్ శ్రీరామస్వామి, గురువాయూర్ శ్రీకృష్ణుడు, మమ్మియూర్ శ్రీ మహాదేవుడు, చెట్టికులంగర శ్రీ భగవతి అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నానని వెల్లడించారు. శతాబ్దాల నాటి సంప్రదాయాలు, దైవిక వాతావరణం తనకు లోతైన భక్తిభావాన్ని, మానసిక ప్రశాంతతను అందించాయని, మన ప్రాచీన సంస్కృతికి అక్కడి దేవాలయాలు సజీవ సాక్ష్యాలని కొనియాడారు.

ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు

తన పర్యటన సాఫీగా సాగేందుకు సహకరించిన కేరళం ప్రభుత్వానికి, సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షించిన కేరళం డీజీపీ, పోలీసు విభాగాలు, త్రిస్సూర్, అలప్పుళ, కొచ్చి జిల్లాల అధికార యంత్రాంగాన్ని పవన్ అభినందించారు. "కేరళ ప్రజల ప్రేమ, ఆతిథ్యం, ఆధ్యాత్మిక జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుంటూ కృతజ్ఞతలతో వీడ్కోలు పలుకుతున్నాను.. థాంక్యూ కేరళం" అంటూ పవన్ తన సందేశాన్ని ముగించారు.

Advertisement
Advertisement