Pre 2005 Notes Ban | రూ.10, 20, 50, 100 పాత నోట్లు రద్దవుతున్నాయా? జూన్ 30 తర్వాత అవి చెల్లవా?
రూ.10, 20, 50, 100 పాత నోట్లు జూన్ 30 తర్వాత రద్దవుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అసలు నిజం వెల్లడించింది.
Viral news | Published On Jun 27, 2026, 11.00 pm IST
- 2005 కంటే ముందు నాటి రూ.10, 20, 50, 100 నోట్లను బ్యాంకులు తీసుకోవు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్
- ఈ ప్రచారాన్ని పూర్తిగా ఫేక్ న్యూస్‌గా కొట్టిపారేసిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
- పాత మహాత్మా గాంధీ సిరీస్ నోట్లు ఎప్పటికీ లీగల్ టెండర్‌గానే కొనసాగుతాయని ఆర్బీఐ (RBI) స్పష్టీకరణ
- అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, ఇలాంటి అబద్ధపు వార్తలను షేర్ చేయవద్దని బ్యాంకు విజ్ఞప్తి
Pre 2005 Notes Ban | త్రినేత్ర.న్యూస్ : సోషల్ మీడియాలో రోజుకో రకమైన వార్త వైరల్ అవుతూ ప్రజల్లో కంగారు పుట్టిస్తోంది. తాజాగా, 2005 కంటే ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్ కు చెందిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు.. జూన్ 30, 2026 తర్వాత చెల్లవని, బ్యాంకులు వీటిని తీసుకోబోవని ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో మళ్లీ నోట్ల రద్దు (Demonetisation) లాంటిదేదో జరుగుతోందా అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఈ వైరల్ వార్తలపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra) స్పందించి, అసలు నిజం ఏంటో తేల్చిచేప్పింది.
ఇది కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే
ఈ ప్రచారంపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన అఫీషియల్ సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పష్టతనిచ్చింది. జూన్ 30 తర్వాత పాత నోట్లను తీసుకోబోమంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇది పూర్తిగా అబద్ధపు సమాచారమని పేర్కొంది. వినియోగదారులు ఇటువంటి వదంతులను నమ్మవద్దని, షేర్ చేయవద్దని కోరుతూ #FakeMessageAlert తో ఒక అలర్ట్ జారీ చేసింది.
వైరల్ మెసేజ్ లో ఏముంది?
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జారీ చేసిన ఒక సర్క్యులర్ ప్రకారం.. జూన్ 30 తర్వాత పాత సిరీస్ నోట్లను రద్దు చేస్తున్నారని, మిగతా బ్యాంకులు కూడా ఇదే బాటలో నడుస్తాయనేది ఆ వైరల్ వార్త సారాంశం. కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి తమకు అలాంటి ఆదేశాలు ఏవీ రాలేదని, ఆ ప్రచారంలో అస్సలు నిజం లేదని సదరు బ్యాంక్ స్పష్టం చేసింది.

అసలు ఆర్బీఐ (RBI) రూల్స్ ఏం చెబుతున్నాయి?
గతంలో 2015లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేస్తూ.. 2005 కంటే ముందు ముద్రించిన పాత నోట్ల చలామణి మార్కెట్లో చాలా వరకు తగ్గిపోయిందని, ఎవరికైనా అవసరమైతే వాటిని బ్యాంకుల్లో ఇచ్చి మార్చుకోవచ్చని తెలిపింది. అయితే, ఆ పాత నోట్లు ఎప్పటికీ లీగల్ టెండర్ (Legal Tender) గానే కొనసాగుతాయని, అంటే అవి ఎప్పుడూ చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది.
నకిలీ నోట్ల ముద్రణకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త నోట్లలో అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొచ్చారే తప్ప, పాత నోట్లను రద్దు చేసే ఉద్దేశం సెంట్రల్ బ్యాంకుకు లేదు. కాబట్టి, జూన్ 30 లోపు పాత నోట్లు మార్చుకోవాలనే రూల్ ఏదీ లేదు. ఇటువంటి ఫేక్ మెసేజ్‌లను నమ్మి అనవసరంగా కంగారు పడకండి. ఏదైనా సమాచారం వస్తే అధికారిక వెబ్‌సైట్లను చూసి మాత్రమే నిర్ధారించుకోండి.
తాజావార్తలు
- ●Beed School Bus Accident | స్కూల్ బస్సు దిగగానే ఘోరం.. సీసీటీవీ వీడియో వైరల్!
- ●CM Revanth Reddy | రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
- ●Netflix | ఓటీటీలో ప్రభాస్ డాక్యుమెంటరీ సిరీస్ ట్రెండింగ్ - హాలీవుడ్ సినిమాలను దాటేసి...
- ●Afghanistan Earthquake | ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్, పాకిస్తాన్లలో వణికిన జనం
- ●Kavitha | మహిళా రిజర్వేషన్ల అమలుకు ఢిల్లీలో భారీ సభ నిర్వహిద్దాం : కల్వకుంట్ల కవిత
- ●Allu Sneha Reddy | నిర్మాతగా అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ - జోకర్ మూవీ లాంఛ్ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా స్నేహారెడ్డి

Beed School Bus Accident | స్కూల్ బస్సు దిగగానే ఘోరం.. సీసీటీవీ వీడియో వైరల్!

CM Revanth Reddy | రేపు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Netflix | ఓటీటీలో ప్రభాస్ డాక్యుమెంటరీ సిరీస్ ట్రెండింగ్ - హాలీవుడ్ సినిమాలను దాటేసి...

Afghanistan Earthquake | ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. భారత్, పాకిస్తాన్లలో వణికిన జనం



