Techie Quits 25 LPA Job | “ఇక నావల్ల కాదు.. పెళ్లి చేసుకోను.. పిల్లలను కనను”.. రూ.25 లక్షల ప్యాకేజీని వదిలేసిన టెకీ.. వైరలవుతున్న పోస్ట్
ఏటా రూ. 25 లక్షల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని ఓ యువకుడు వదిలేశాడు. కార్పొరేట్ లైఫ్‌లో ఆ రేసు ఇక నావల్ల కాదు అంటున్నాడు. అసలేం జరిగింది?
Viral news | Published On May 20, 2026, 5.24 pm IST
Techie Quits 25 LPA Job | త్రినేత్ర.న్యూస్ : ప్రతి ఒక్కరూ లక్షల ప్యాకేజీలు, ఐటీ (IT) ఉద్యోగాల కోసం పరుగులు పెడుతుంటే.. ఒక 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer) మాత్రం ఏకంగా రూ.25 లక్షల (Rs 25 LPA) జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. కారణం.. కార్పొరేట్ సంస్కృతిలో నిరంతరం పనిచేస్తూ ఎదురయ్యే ఒత్తిడిని, ఉరుకులు పరుగుల జీవితాన్ని భరించలేకపోవడమే! "ఇక నా వల్ల కాదు (bas ho gaya)" అంటూ ఈ టెక్కీ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో (Reddit) వైరల్‌గా మారింది.
'బస్ హో గయా'.. ఒత్తిడితో అలిసిపోయా
"నా వయసు 29, నా 25 లక్షల సాఫ్ట్‌వేర్ జాబ్‌కు రిజైన్ చేశాను, నాకు ఇక పనిచేయాలని లేదు" అనే టైటిల్‌తో ఈ టెక్కీ తన మనసులోని మాటను పంచుకున్నాడు. ఆరేళ్ల అనుభవం ఉన్న ఈ ఇంజినీర్.. కాలేజీ రోజుల నుంచే టైమ్ వేస్ట్ చేయకుండా పనిచేశానని తెలిపాడు. ఫుల్ టైమ్ జాబ్ చేస్తూనే, అదనపు ఆదాయం కోసం ఫ్రీలాన్సింగ్ (freelancing), స్టూడెంట్స్‌కు క్లాసులు చెప్పడం, క్లయింట్ల కోసం వెబ్‌సైట్లు డిజైన్ చేయడం లాంటివి ఎన్నో చేశాడు. అయితే, ఈ విరామం లేని పరుగు వల్ల మానసికంగా పూర్తిగా అలిసిపోయానని (burnout) చెప్పాడు. "నిజం చెప్పాలంటే, నేను ఒక దశకు చేరుకున్నాను.. ఇక నావల్ల కాదు అనిపిస్తోంది" అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో రాసుకొచ్చాడు.
కొత్త ప్లాన్స్ ఏంటి?
ప్రస్తుతం తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం గానీ, పిల్లల్ని కనాలని గానీ, దీర్ఘకాలిక ప్రణాళికలు గానీ లేవని అతను స్పష్టం చేశాడు. కాస్త ప్రశాంతత కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి (Manali)కి మకాం మార్చాలని ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. అతడి వద్ద ప్రస్తుతం రూ.15 లక్షల సేవింగ్స్ ఉన్నాయి. నెలకు రూ.30 వేల ఖర్చుతో చూసుకున్నా.. మరో మూడు నాలుగేళ్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా బతికేయగలనని అంచనా వేశాడు.
సరికొత్త జాబ్ కోసం వెతికే ఉద్దేశం కూడా లేదని.. ప్రస్తుతం తనకు కావలసింది కేవలం "ప్రశాంతత, స్పష్టత, ఆలోచించుకోవడానికి సమయం" మాత్రమే అని అన్నాడు. భవిష్యత్తులో బహుశా తన సొంత ప్రాజెక్టులు చేసుకోవడమో లేదా మళ్లీ ఫ్రీలాన్సింగ్ చేయడమో చేస్తానని హింట్ ఇచ్చాడు.
నెటిజన్ల రియాక్షన్ ఏంటి?
ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది. చాలామంది ఈ టెక్కీకి మద్దతుగా నిలుస్తూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు.
"కెరీర్ అనేది మారథాన్ లాంటిది.. స్ప్రింట్ కాదు. నువ్వు తీవ్ర ఒత్తిడికి గురయ్యావు (burnt out). కాస్త విశ్రాంతి తీసుకో" అని ఒకరు సలహా ఇచ్చారు.
"మంచి నిర్ణయం బ్రో! నేను కూడా గతేడాది కార్పొరేట్ జాబ్ వదిలేసి ఫ్రీలాన్సర్‌గా మారాను. ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది" అని మరొకరు కామెంట్ చేశారు.
మరొక నెటిజన్ అయితే.. "నేను కూడా 40 లక్షల సేవింగ్స్‌తో నా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేయాలనుకుంటున్నాను" అని ఆశ్చర్యకరమైన విషయాన్ని పంచుకున్నాడు.
"నేను కూడా ఇలాగే మూడు నెలలు బ్రేక్ తీసుకుని.. బైక్ ట్రిప్ వెళ్లి రీఫ్రెష్ అయ్యాను. ఆ తర్వాత మళ్లీ జాబ్‌లో చేరాను. అప్పుడప్పుడు ఇలా బ్రేక్ తీసుకోవడం అందరికీ అవసరమే" అని ఇంకొకరు తమ అనుభవాన్ని రాసుకొచ్చారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



