Gurgaon Man Rs 2.4 Lakh Monthly Expenses | నెలకు రూ.2.4 లక్షల ఖర్చా? గురుగ్రామ్ టెక్కీ బడ్జెట్ చూసి నెటిజన్లు షాక్.. ఆ ఒక్క దానికే రూ.53 వేలు!
మెట్రో నగరాల్లో జీవన వ్యయం ఆకాశాన్ని తాకుతోంది. తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ఒక వ్యక్తి తన నెలవారీ ఖర్చుల చిట్టాను బయటపెట్టారు. నెలకు రూ.2.4 లక్షలు ఎలా ఖర్చవుతున్నాయో అతడు వివరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
Viral news | Published On Feb 21, 2026, 11.30 pm IST
Gurgaon Man Rs 2.4 Lakh Monthly Expenses | త్రినేత్ర.న్యూస్ : నేటి కాలంలో సంపాదన పెరిగినా, దానికి తగ్గట్టే ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో నివసించే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ఒక యువకుడు తన నెలవారీ ఖర్చుల వివరాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, అవి చూసి సామాన్యులే కాదు, సంపన్నులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఖర్చుల చిట్టా ఇదే (నెలవారీ)
సదరు వ్యక్తి తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వివరాల ప్రకారం.. ఆయన నెలవారీ మొత్తం ఖర్చు రూ.2,44,000. ఇంటి అద్దెకి రూ.53,000 (గురుగ్రామ్‌లోని ఒక పోష్ ఏరియాలో నివసిస్తున్నందుకు), నిత్యావసరాలకు రూ.15,000, జిమ్ అండ్ సబ్‌స్క్రిప్షన్ల కోసం నెలకు వేలల్లో ఖర్చు, ఇంటి సెటప్ అండ్ మెయింటెనెన్స్ కోసం మిగిలిన మొత్తం ఇతర అవసరాలకు, ప్రయాణాలకు, డైనింగ్ అవుట్‌కు ఖర్చవుతున్నట్లు తెలిపాడు.
నెటిజన్ల రియాక్షన్
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. "నువ్వు నెలకు చేసే ఖర్చు, నా సంవత్సర ఆదాయం కంటే ఎక్కువ" అని ఒకరు కామెంట్ చేయగా.. "అంత అద్దె కట్టే బదులు సొంత ఇల్లు కొనుక్కోవచ్చు కదా?" అని మరొకరు ప్రశ్నించారు. "లగ్జరీ లైఫ్ అలవాటైతే ఖర్చులు ఇలాగే ఉంటాయి, ఇది మిడిల్ క్లాస్ బడ్జెట్ కాదు" అంటూ కొందరు విమర్శిస్తున్నారు.
మెట్రో నగరాల్లో పెరిగిన వ్యయం
ఈ పోస్ట్ ద్వారా మెట్రో నగరాల్లో, ముఖ్యంగా ఐటీ హబ్‌లుగా ఉన్న బెంగళూరు, గురుగ్రామ్ వంటి చోట్ల సామాన్యులు జీవించడం ఎంత భారంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులు, నిత్యావసరాల ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి.
View this post on Instagram
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



