త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Akhilee Matta Standup Comedy | నెలకు లక్షల జీతం.. అయినా నవ్వించడం కోసమే ఆ ఉద్యోగాన్ని వదిలేసిన యువతి సక్సెస్ స్టోరీ

ఢిల్లీలో భారీ ప్యాకేజీతో సాగిపోతున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి, స్టాండప్ కామెడీని ఫుల్-టైమ్ కెరీర్‌గా ఎంచుకున్నారు అఖిలీ మట్టా. తనలో దాగున్న నవ్వించే టాలెంట్‌ను గుర్తించి, ఓపెన్ మైక్స్ నుంచి హౌస్‌ఫుల్ షోల వరకు ఆమె సాగించిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

J

Viral news | Published On May 6, 2026, 3.39 pm IST

Akhilee Matta Standup Comedy | నెలకు లక్షల జీతం.. అయినా నవ్వించడం కోసమే ఆ ఉద్యోగాన్ని వదిలేసిన యువతి సక్సెస్ స్టోరీ
Advertisement

Akhilee Matta Standup Comedy | త్రినేత్ర.న్యూస్ : అఖిలీ మట్టా ఢిల్లీ ఎన్‌సీఆర్ (Delhi NCR) లో భారీ జీతం తీసుకునే సీనియర్ కార్పొరేట్ ప్రొఫెషనల్. అంతేకాదు, 2019 నుంచి ఆమె రాసుకున్న జోక్స్‌తో నిండిన ఒక డైరీ కూడా ఆమె వద్ద ఉండేది. జూలై 2025లో, స్టాండప్ కామెడీని ఫుల్-టైమ్ కెరీర్‌గా ఎంచుకోవడానికి ఆమె తన ఉద్యోగాన్ని వదిలేశారు. ఇప్పుడు ఆమె నాలుగు నగరాల్లో హౌస్‌ఫుల్ (sold-out) సోలో షోలు చేసి సక్సెస్ ఫుల్ కమెడియన్‌గా దూసుకుపోతున్నారు. ఇదంతా "స్టాండప్ కామెడీ" అనే పేరు కూడా పెద్దగా పరిచయం లేని రోజుల్లో.. ఒక న్యూ ఇయర్ ఈవ్ హౌస్ పార్టీలో మొదలైంది.

ఆ పార్టీ హోస్ట్ చేస్తున్న వ్యక్తి, ఇంకా పార్టీ మొదలుకాలేదని, వేరొకరు రావలసి ఉందని, అతను వస్తేనే పార్టీకి కళ వస్తుందని అక్కడున్న వారందరికీ చెబుతూనే ఉన్నాడు. ఆ మాటలను చాలాసేపు విన్న అఖిలీ మట్టా.. ఆ వ్యక్తి రాగానే తనదైన శైలిలో కౌంటర్ల వర్షం కురిపించింది. చాలా స్వీట్‌గా.. "అవును, నువ్వు లేకుండా పార్టీ ఎలా మొదలవుతుంది? మా అందరి దృష్టిలో నువ్వే ఈ 'పార్టీకి ప్రాణం'" అని చెబుతూనే, "నువ్వు తీసుకురావాల్సిన ఆ ఉత్సాహం ఏదీ?" అని అడిగింది. దానికి అతను తల దించుకుని, ఈమె ఎవరో తనకు తెలియదని చెప్పాడు. ఆ దెబ్బకు అక్కడున్న వారంతా పడి పడి నవ్వారు. ఆ సంభాషణ ముగిసేసరికి, ఆ గదిలో అందరూ ఎదురుచూసే స్టార్ అతను కాదు.. ఆమె అయిపోయింది!

9 AM Standup Meeting to 9 PM Standup Comedy Why Akhilee Matta Quit Her High-Paying Corporate Job

ఆమె స్నేహితుడు గౌరవ్ సేథి (ఇప్పుడు ఆమె భర్త) ఇదంతా గమనిస్తున్నాడు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో అద్భుతమైన కళ దాగి ఉందని అతనికి అక్కడే అర్థమైంది. "ఆమె చాలా స్పాంటేనియస్‌గా, చమత్కారంగా మాట్లాడగలదు. ఎదుటివారిని నొప్పించకుండానే నవ్వించగలదు. 'అందరికీ లేని సహజమైన ప్రతిభ నీకు ఉంది. ఇండస్ట్రీలో ఎందుకు ప్రయత్నించకూడదు?' అని ఆమెతో చెప్పడం మొదలుపెట్టాడు."

కానీ అప్పట్లో ఢిల్లీలో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ జాబ్ చేసుకుంటున్న అఖిలీ దృష్టిలో అలాంటి ఇండస్ట్రీ ఏదీ లేదు. ఆమె తన సొంతూరు ఝాన్సీ (Jhansi) నుండి ముంబైకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం వెళ్లి, తను ఎంచుకున్న వృత్తి మీదనే దృష్టి పెట్టింది. నిజానికి, అఖిలీ చిన్నప్పటి నుంచే చాలా ఫన్నీగా ఉండేది. భోజనం చేసేటప్పుడు తన టీచర్లను, వాళ్లు బోర్డును ఎలా తుడుస్తారో మిమిక్రీ చేసి చూపించేది. సగం మంది స్టాఫ్ రూమ్ టీచర్లకు ఆమె ముద్దు పేర్లు పెట్టింది. ఇంట్లో ఆమె తమ్ముడు ఆమెను నవ్విస్తే, బయట ఆమె అందరినీ నవ్వించేది.

9 AM Standup Meeting to 9 PM Standup Comedy Why Akhilee Matta Quit Her High-Paying Corporate Job

కానీ ఆ రోజుల్లో ఝాన్సీలో ఇంజనీర్ లేదా బ్యాంకర్ అన్నట్లుగా "కామిక్" (comic) అనే పదాన్ని ఎవరూ బయటకు అనేవారు కాదు. కాబట్టి చాలా మంది ఫన్నీ మహిళల్లాగే ఆమె కూడా దానిని తన వ్యక్తిత్వంలో ఒక భాగంగా దాచేసుకుని, ప్రెస్ రిలీజ్‌లు ఎలా రాయాలో నేర్చుకోవడానికి ముంబై వెళ్లిపోయింది.

తోడుగా నిలిచిన ఆ సంవత్సరాలు

ఆ పార్టీలో తాను చూసిన ప్రతిభకు సరైన దారి చూపించడానికి గౌరవ్‌కు 2019 వరకు సమయం పట్టింది. భారతదేశంలో స్టాండప్ కామెడీ అప్పుడప్పుడే ఊపందుకుంటోంది. అతను ఆమెను ఓపెన్ మైక్స్‌కి, ఆ తర్వాత ఢిల్లీలో ముంబై కామిక్ చేస్తున్న టూరింగ్ షోకి తీసుకెళ్లడం ప్రారంభించాడు. అవన్నీ చూసి ఆమె, "ఇది చాలా పాలిష్డ్‌గా ఉంది. నేను ఇలా చేయలేను. ఒక సెటప్, ఒక పంచ్... మనం మొదలుపెడుతున్నప్పుడు ఇవేవీ మనకు తెలియవు" అని భయపడింది.

కానీ గౌరవ్ వదిలిపెట్టలేదు. జోక్‌ను ఎలా రాసుకోవాలి, ఒక అంచనాను ఎలా క్రియేట్ చేసి దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అనే విషయాలపై వీడియోలు పంపేవాడు. తన భార్య వచ్చి నేర్చుకోవచ్చా అని ఎప్పుడూ కలవని కామిక్స్‌కు ఈమెయిల్స్ చేశాడు. వారిలో ఒకరైన జీవేశు అహ్లువాలియా (Jeeveshu Ahluwalia) అందుకు అంగీకరించాడు. ఆ కలయిక ఆమె ప్రయాణాన్ని మార్చేసింది.

9 AM Standup Meeting to 9 PM Standup Comedy Why Akhilee Matta Quit Her High-Paying Corporate Job

ఆరోజు జీవేశు ఆమెకు రెండు విషయాలు చెప్పాడు. మొదటిది భాష గురించి. బూతు పదాలు (abusive words) ఉపయోగించి రాయవద్దని, స్టేజ్ మీద తిడితే వెంటనే నవ్వులు రావచ్చు కానీ, దాని వల్ల ప్రేక్షకులను దూరం చేసుకున్నట్లు అవుతుందని సూచించాడు. రెండోది.. ఒక మైక్ ప్లాప్ అయినా సరే, ధైర్యం కోల్పోవద్దు. మరింత బలంగా తిరిగి రావాలి. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె తన మొదటి ఓపెన్ మైక్‌కి వెళ్లింది. అది పర్వాలేదనిపించింది. కానీ రెండోది ఫ్లాప్ అయింది. స్టేజ్ మీదకు కాన్ఫిడెన్స్‌తో వెళ్ళినప్పటికీ, అసలు 5 నిమిషాలు ఏం మాట్లాడాలో ఆమె ప్రిపేర్ అవ్వలేదు. స్నేహితుల ముందు జోకులు వేయడానికి, నవ్వడానికి ఎదురుచూసే అపరిచితుల మధ్య పర్ఫార్మ్ చేయడానికి ఉన్న తేడా అప్పుడు ఆమెకు తెలిసింది. ఆ రెండో మైక్ ఆమెకు ఎంతో క్రమశిక్షణను నేర్పింది. ఆమె ప్రతిరోజూ ఒక డైరీలో రాయడం ప్రారంభించింది. ప్రతి సెట్ ఆడియోను రికార్డ్ చేసుకుని, ఇంటికి వెళ్లేటప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకునేది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆఫీస్‌కు వెళ్లి, వారాంతాల్లో గౌరవ్‌తో కలిసి ఓపెన్ మైక్స్‌లో పెర్ఫార్మ్ చేసేది.

ప్రేక్షకులే ఒక అద్దం

ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. కామెడీ షోలు అన్నీ మూతపడ్డాయి. చాలా మంది కామిక్స్‌కు ఇది ఒక ఎదురుదెబ్బ. కానీ అఖిలీకి ఇది ఒక అవకాశం. ఆమె 'సిట్ డౌన్ విత్ స్టాండప్స్' (Sit Down with Standups) అనే పాడ్‌క్యాస్ట్‌ను ప్రారంభించి, ఎస్టాబ్లిష్ అయిన కామిక్స్ తమ కెరీర్‌లను ఎలా నిర్మించుకున్నారో అడిగి తెలుసుకుంది. మైక్స్ మళ్లీ తెరుచుకున్నప్పుడు, ఆమె మళ్లీ జీరో నుండి ప్రారంభించాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌లో రాయకపోవడం వల్ల డైరీ ఖాళీగా ఉంది.

ప్రేక్షకుల విషయంలో ఉన్న నిజం ఇదే అని ఆమె అంటుంది. "వాళ్లు ఒక అద్దం లాంటివారు. వాళ్లు నటించరు. మీరు ట్రాక్ తప్పినా, సెటప్ కంటే ముందే పంచ్‌లైన్ వచ్చేసినా, వాళ్లు మీ ముఖంపైనే చెప్పేస్తారు. మీ డైరీలో వెయ్యి లైన్లు ఫన్నీగా ఉన్నాయని మీరు అనుకోవచ్చు, కానీ ఏ రెండు లైన్లు నిజంగా ఫన్నీగా ఉన్నాయో ప్రేక్షకులు మాత్రమే చెబుతారు." 2023లో ఆమె తన మొదటి స్టాండప్ వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టింది. లైవ్ ఆడియన్స్ ముందు అదరగొట్టిన ఆ సెట్ యూట్యూబ్‌లో మాత్రం వర్కౌట్ కాలేదు. అయినా ఆమె నిరుత్సాహపడకుండా రాయడం కొనసాగించింది.

'మనసులో ఎప్పుడూ ఆ కోరిక ఉండేది'

జూన్ 2025లో, ఆమె తన రెండో స్టాండప్ వీడియోను రిలీజ్ చేసింది. ఈసారి అది మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది. గత ఏడాది సెప్టెంబరులో చండీగఢ్‌లో 270 మందికి పైగా ప్రేక్షకుల ముందు సోలో షో చేసింది. "మనసులో ఎప్పుడూ ఆ కోరిక ఉంటూనే ఉంటుంది. కార్పొరేట్ జాబ్ మాత్రమే ప్లాన్ B అని మనకు మనం కండిషన్ అయిపోతాము. కానీ ఎక్కడో ఒక చోట మన అసలు లక్ష్యాన్ని ఎంచుకోవాలి" అని అఖిలీ చెబుతుంది. భారీ జీతం, సీనియర్ పొజిషన్ ఉన్నప్పటికీ.. తాను కేవలం ఒక యంత్రంలా పనిచేస్తున్నానని, జీవించడం లేదని ఆమె గ్రహించింది. జూలై 2025లో ఆమె తన జాబ్ వదిలేసింది. ఆమె సంతోషమే ముఖ్యమని భర్త గౌరవ్ అండగా నిలిచాడు.

కామెడీ కనెక్ట్ అయినప్పుడు

అఖిలీ కామెడీ చాలా క్లీన్‌గా ఉంటుంది. కుటుంబం, బాల్యం, పెద్దయ్యాక ఎదురయ్యే సర్దుబాట్లపై ఆమె జోక్స్ ఉంటాయి. ఒకసారి కేఫ్‌లో షో పూర్తయిన తర్వాత, ఒక వయసు పైబడిన మహిళ ఆమెను ఆపి, "కూతుళ్లు వెళ్లిపోవడంతో ఇల్లు నిశ్శబ్దంగా మారి బాధలో ఉన్నాను. కానీ నీ షో చూసి గత గంటగా నా బాధనంతా మరిచిపోయి నవ్వుకున్నాను" అని హత్తుకుంది. "ఇలాంటి మాటలు విన్నప్పుడే నా కష్టం వృధా పోలేదని, నేను ఎవరికో ఒకరికి సంతోషాన్ని ఇస్తున్నానని అనిపిస్తుంది" అని అఖిలీ అంటుంది.

దీనికి ముగింపు అంటూ ఉందా?

టైమ్‌లైన్స్, ఫినిష్ లైన్స్ లాంటి పదాలను తాను నమ్మనని అఖిలీ అంటుంది. "మరొకరి టైమ్‌లైన్‌కి సరిపోలడానికి మీపై మీరు భారం వేసుకోకండి. అందరూ మిమ్మల్ని నమ్మకపోవచ్చు, అయినా పర్వాలేదు. మీ వేగంతో మీరు వెళ్లండి. దారి తప్పినా, విఫలమైనా పర్వాలేదు. మీరు తీసుకునే నిర్ణయాలకు మీరే మద్దతుగా నిలబడండి." గత ఏడాది బెంగళూరు, పూణె, గుర్గావ్, లక్నోలలో సోలో షోలు విజయవంతంగా పూర్తి చేసిన ఆమె.. ఇప్పుడు మే 9, 2026 న అమృత్‌సర్‌లో సోలో షో చేయడానికి సిద్ధంగా ఉంది.

9 AM Standup Meeting to 9 PM Standup Comedy Why Akhilee Matta Quit Her High-Paying Corporate Job

ఆరేళ్ల క్రితం గౌరవ్ ఆమెలో ఒక కామిక్‌ను చూసి ఎంకరేజ్ చేశాడు. ఈరోజు ఆమె ఆడిటోరియం నిండా ఉన్న ప్రేక్షకుల నవ్వుల్లో తనను తాను చూసుకుంటోంది. అందుకే ఇంట్లో ఇప్పుడు గౌరవ్ ఆమెను గర్వంగా "స్మైలింగ్ ఆఫీసర్" అని పిలుస్తాడు. ఆ పేరు ఆమెకు అక్షరాలా సరిపోతుంది!

Advertisement
Advertisement