త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thailand Visa-Free Entry 2026 | థాయ్‌లాండ్ ప్లాన్ చేస్తున్నారా : భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీ.. కానీ ఆ ఒక్క రూల్ మారింది!

థాయ్‌లాండ్ వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్! వీసా-ఫ్రీ ఎంట్రీ సదుపాయం కొనసాగుతుంది, కానీ నిబంధనల్లో ఒక పెద్ద మార్పు జరిగింది. అవేంటో తెలుసుకొని థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి.

J

Tourism | Published On Jul 17, 2026, 1.00 am IST

Thailand Visa-Free Entry 2026 | థాయ్‌లాండ్ ప్లాన్ చేస్తున్నారా : భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీ.. కానీ ఆ ఒక్క రూల్ మారింది!

సంక్షిప్త సారాంశం

భారతీయులకు థాయ్‌లాండ్ వీసా-ఫ్రీ (Visa-Free) ఎంట్రీ సదుపాయం యథాతథంగా కొనసాగుతుంది. కానీ, అక్కడ గరిష్టంగా ఉండే కాలవ్యవధిని (Stay limit) 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించారు. విదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘిస్తూ అనధికారికంగా పనులు చేస్తుండటంతో థాయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Thailand Visa-Free Entry 2026 | త్రినేత్ర.న్యూస్ : హాలిడే ట్రిప్ కోసం థాయ్‌లాండ్ (Thailand) వెళ్లాలనుకునే భారతీయులకు ఇది నిజంగా శుభవార్తే. గత కొద్ది నెలలుగా ఉన్న గందరగోళానికి తెరదించుతూ ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కు వీసా-ఫ్రీ ఎంట్రీ (Visa-free entry) సదుపాయాన్ని థాయ్‌లాండ్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. అయితే, ఈ ప్లానింగ్‌లో మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక చిన్న ట్విస్ట్ ఉంది.

60 నుంచి 30 రోజులకు కుదింపు

ఇంతకుముందు ఈ వీసా-ఫ్రీ స్కీమ్ కింద 60 రోజుల పాటు థాయ్‌లాండ్‌లో ఉండేందుకు పర్యాటకులకు అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ గరిష్ట పరిమితిని (Maximum stay limit) 30 రోజులకు కుదించారు. అంటే, మీరు వీసా లేకుండానే థాయ్‌లాండ్ వెళ్లొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు.. కానీ 30 రోజుల్లోగా తిరిగి రావాల్సి ఉంటుంది.

ఎందుకీ నిర్ణయం?

భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీని రద్దు చేస్తారంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. దీంతో థాయ్‌లాండ్ వెళ్లే మన టూరిస్టుల సంఖ్య అకస్మాత్తుగా పడిపోయింది. ఆ ప్రతిపాదనను అధికారికంగా అమలు చేయకపోయినా, ట్రావెలర్స్‌లో నెలకొన్న ఆందోళన కారణంగా టూరిజంపై తీవ్ర ప్రభావం పడింది. చైనా, మలేషియా తర్వాత థాయ్‌లాండ్‌కు అత్యధికంగా వచ్చేది భారతీయ టూరిస్టులే కావడం గమనార్హం.

ఈ కొత్త విధానం భారతీయ పర్యాటకుల ప్రయాణ అలవాట్లకు అనుగుణంగా ఉంటుందని థాయ్‌లాండ్ టూరిజం మంత్రి సురసక్ (Surasak Phancharoenworakul) తెలిపారు. "భవిష్యత్తులో ఈ నిర్ణయం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, అప్పుడు ప్రభుత్వం దీనిని మళ్లీ సమీక్షిస్తుంది" అని ఆయన బ్లూమ్‌బర్గ్ (Bloomberg) కు వెల్లడించారు.

వీసా దుర్వినియోగానికి చెక్

ప్రధాని అనుతిన్ చార్న్‌వీరాకుల్ (Anutin Charnvirakul) ప్రభుత్వం ప్రధానంగా వీసా నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకే ఈ 30-రోజుల లిమిట్ విధించింది. కొందరు విదేశీయులు టూరిస్ట్ వీసాపై వచ్చి అక్రమ కార్యకలాపాలకు పాల్పడటం, అనుమతి లేకుండా ఉద్యోగాలు చేస్తుండటంపై స్థానిక వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ తాజా నిబంధనలతో భారత్‌తో పాటు క్రొయేషియా, బల్గేరియా, సైప్రస్, మాల్టా, మాల్దీవుల పౌరులకు కూడా 30 రోజుల వీసా-ఫ్రీ ఎంట్రీ మాత్రమే వర్తిస్తుంది. థాయ్ ఆర్థిక వ్యవస్థకు టూరిజం ఒక ప్రధాన పిల్లర్ అన్న సంగతి తెలిసిందే. కాబట్టి, టూరిజాన్ని ప్రోత్సహిస్తూనే అక్రమాలకు చెక్ పెట్టేలా థాయ్ సర్కార్ ఈ బ్యాలెన్సింగ్ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement