త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raghunandar Rao | మేం రాజీనామా చేస్తాం.. నువ్వు సిద్ధ‌మా

Raghunandar Rao | తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేసి, ఎన్నిక‌ల‌కు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నారా అని బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు ప్ర‌తి స‌వాల్ విసిరారు. ఎవ‌రు గెలుస్తారో ప్ర‌జా క్షేత్రంలోనే తేల్చుకుందామ‌ని స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Jun 14, 2026, 7.14 pm IST

Raghunandar Rao | మేం రాజీనామా చేస్తాం.. నువ్వు సిద్ధ‌మా
Advertisement
  • సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు ప్రతి సవాల్

Raghunandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేసి, ఎన్నిక‌ల‌కు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నారా అని బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్‌రావు ప్ర‌తి స‌వాల్ విసిరారు. రేవంత్ త‌న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు రావాల‌ని సూచించారు. కావాలంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎంపీల‌ను అట్లాగే ఉంచుకోవ‌చ్చ‌ని చెప్పారు. ఎవ‌రు గెలుస్తారో ప్ర‌జా క్షేత్రంలోనే తేల్చుకుందామ‌ని స్ప‌ష్టం చేశారు.

ముఖ్య‌మంత్రి రేవంత్‌కు చేత‌నైతే త‌మ స‌వాల్ స్వీక‌రించాల‌ని అన్నారు. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ఇంటి ముందు వ‌డ్లు పోస్తే త‌మ‌కు కొడంగ‌ల్‌లో, ప్ర‌గ‌తిభ‌వ‌న్ ముందు వ‌డ్లు పోసుడు రాదా అని ప్ర‌శ్నించారు. కానీ తాము ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి గౌర‌వ‌మిస్తున్నామ‌ని చెప్పారు. త‌మ సంస్కారాన్ని చేత‌కానిత‌నం అనుకోవ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు.

Advertisement
Advertisement