త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

తెలంగాణ ఇంటర్ పరీక్షలు 2026: ఈనెల 25 నుంచే ఎగ్జామ్స్.. పరీక్షలు రాయనున్న 9.97 లక్షల మంది విద్యార్థులు, నిబంధనలు ఇవే!

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థుల కోసం 1495 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిసి కెమెరాల నిఘా, నిరంతర విద్యుత్, ఆర్టీసీ బస్సుల సదుపాయంతో పాటు మాల్ ప్రాక్టీస్ జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.

J

Telangana | Published On Feb 23, 2026, 3.48 pm IST

తెలంగాణ ఇంటర్ పరీక్షలు 2026: ఈనెల 25 నుంచే ఎగ్జామ్స్.. పరీక్షలు రాయనున్న 9.97 లక్షల మంది విద్యార్థులు, నిబంధనలు ఇవే!
Advertisement

TS Inter Exams 2026 | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) మార్చి-2026 నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు

పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరుగుతాయి. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. అందులో మొదటి సంవత్సరం విద్యార్థులు (జనరల్, ఒకేషనల్ కలిపి) 4,89,126 కాగా, రెండో సంవత్సరం విద్యార్థులు (జనరల్, ఒకేషనల్ కలిపి) 5,07,949 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం పరీక్షా కేంద్రాలు 1,495.

కట్టుదిట్టమైన నిఘా - మాల్ ప్రాక్టీస్ నివారణ

పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా బోర్డు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఈసారి ఫ్లయింగ్ స్క్వాడ్స్ 75 బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తాయి. సిట్టింగ్ స్క్వాడ్స్ 200 బృందాలను పరీక్షా కేంద్రాల్లో నియమించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సిసి కెమెరాల నిఘా ఉంటుంది. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు

విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పరీక్షా సమయాల్లో విద్యార్థుల కోసం ఆర్టీసీ (RTC) ప్రత్యేక బస్సులను నడపనుంది. పరీక్షా కేంద్రాల్లో అంతరాయం లేని విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి కేంద్రంలో డ్రింకింగ్ వాటర్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఆరోగ్య సిబ్బంది (ANM) అందుబాటులో ఉంటారు. విద్యార్థులు కింద కూర్చుని పరీక్ష రాయకుండా సరిపడా ఫర్నిచర్, ప్రతి గదిలో వాల్ క్లాక్స్ ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement