త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Revenue Department transfers | తెలంగాణ రెవెన్యూ శాఖలో భారీ బదిలీలు: 27 మంది అదనపు, డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ బదిలీలు జరిగాయి. పరిపాలనా సౌలభ్యం కోసం 27 మంది అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల పూర్తి జాబితా ఇదే.

J

Telangana | Published On May 5, 2026, 4.15 pm IST

Telangana Revenue Department transfers | తెలంగాణ రెవెన్యూ శాఖలో భారీ బదిలీలు: 27 మంది అదనపు, డిప్యూటీ కలెక్టర్లకు స్థానచలనం
Advertisement

Telangana Revenue Department transfers | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీస్థాయిలో బదిలీలు జరిగాయి. పరిపాలనా సౌలభ్యం, అధికార యంత్రాంగాన్ని పటిష్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 27 మంది అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ డి.ఎస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నెంబర్ 240 (G.O.Rt.No.240) ద్వారా ఈ బదిలీలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

బదిలీ అయిన అధికారుల జాబితా, కొత్త పోస్టింగ్‌లు

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కొత్త స్థానాల్లో నియమితులైన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.

  • బి. హరి సింగ్ - అదనపు కలెక్టర్ (రెవెన్యూ), సూర్యాపేట
  • ఆర్.డి. మాధురి - స్పెషల్ కలెక్టర్, ఐ అండ్ క్యాడ్, నల్గొండ
  • డి. రాజ్యలక్ష్మి - అదనపు కలెక్టర్ (రెవెన్యూ), పెద్దపల్లి
  • సీహెచ్. మధు మోహన్ - అదనపు కలెక్టర్ (రెవెన్యూ), గద్వాల్
  • టి.ఎల్. సంగీత - అదనపు కలెక్టర్ (రెవెన్యూ), సంగారెడ్డి
  • వి. హనుమా నాయక్ - స్పెషల్ కలెక్టర్, ఐ అండ్ క్యాడ్, వరంగల్
  • ఎం. సూర్య ప్రకాష్ - డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ (డీఆర్ఓ), వనపర్తి
  • సీహెచ్. వెంకటేశ్వర్లు - డీఆర్ఓ, జనగామ
  • బి. వసంత కుమారి - డీఆర్ఓ, జయశంకర్ భూపాలపల్లి
  • ఎస్. పద్మావతి - డీఆర్ఓ, భద్రాద్రి కొత్తగూడెం
  • వి. రమాదేవి - డీఆర్ఓ, రాజన్న సిరిసిల్ల
  • జుబేదున్నిసా బేగం - డీఆర్ఓ, మహబూబాబాద్
  • డి. వేణు - డీఆర్ఓ, కుమ్రంభీం ఆసిఫాబాద్
  • బి. స్రవంతి - డీఆర్ఓ, ఆదిలాబాద్
  • ఎస్. రాజేశ్వరి - డీఆర్ఓ, నారాయణపేట
  • కె. శ్రీనివాస్ - డీఆర్ఓ, హనుమకొండ
  • ఎల్. రమేష్ - రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ), నారాయణపేట
  • రవీందర్ రెడ్డి అడ్ల - ఆర్డీఓ, బాన్సువాడ
  • బి. గీత - డీఆర్ఓ, నిజామాబాద్
  • జి. అంబాదాస్ రాజేశ్వర్ - డీఆర్ఓ, మెదక్
  • ఎం. షర్మిల - ఆర్డీఓ, ఉట్నూర్
  • ఎం. విజయ కుమారి - ఆర్డీఓ, బోధన్
  • ఎస్. రమణ రెడ్డి - ఆర్డీఓ, మిర్యాలగూడ
  • దొనకంటి రవీందర్ - ఆర్డీఓ, కాటారం
  • ఎన్. రాజేందర్ రెడ్డి - ఆర్డీఓ, సిరిసిల్ల
  • కే.ఎస్.బి. కుమారి - ఆర్డీఓ, వేములవాడ
  • పి. పద్మ ప్రియ - ఆర్డీఓ, దేవరకొండ

దీనితో పాటుగా, ప్రస్తుతం బదిలీపై ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఆర్.వి. రాధాబాయిని తదుపరి పోస్టింగ్ కోసం రెవెన్యూ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఎదుట రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అధికారుల బదిలీలు, విధుల్లో చేరిన తేదీలను వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని సంబంధిత విభాగాలను సర్కార్ ఆదేశించింది.

Advertisement
Advertisement