GPO Service Rules 2025 | తెలంగాణ ‘గ్రామ పాలన ఆఫీసర్’ సర్వీస్ రూల్స్ విడుదల: జీవో 32 ద్వారా మార్గదర్శకాలు జారీ
తెలంగాణలో గ్రామ పరిపాలనను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 'గ్రామ పాలన ఆఫీసర్' (GPO) పోస్టులకు సంబంధించి సర్వీస్ రూల్స్-2025ను ఖరారు చేస్తూ రెవెన్యూ శాఖ జీవో నెం. 32 విడుదల చేసింది. నియామక విధానం, అర్హతలు, ప్రొబేషన్ వివరాలను ప్రభుత్వం ఈ జీవోలో స్పష్టం చేసింది.
- గ్రామ పాలన అధికారులకు కొత్త రూల్స్
- జీవో 32 జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- అర్హతలు, నిబంధనలు ఇవే
GPO Service Rules 2025 | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పరిపాలన వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పాలన ఆఫీసర్ పోస్టుల నియామకం, సర్వీస్ నిబంధనలకు సంబంధించి 'తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-2025'ను ఖరారు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (సర్వీసెస్-II) శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్.. జీవో ఎం.ఎస్.నెం.32 ను విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం గ్రామ పాలన అధికారుల నియామకం, అర్హతలు, శిక్షణ, ప్రొబేషన్ తదితర అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి.
నియామక పద్ధతి
గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులను రెండు పద్ధతుల్లో భర్తీ చేస్తారు.
(1) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్: నేరుగా పరీక్ష ద్వారా ఎంపిక చేయడం.
(2) బదిలీ : ఇతర శాఖల్లో సర్దుబాటు చేయబడిన మాజీ వీఆర్వోలు, జూనియర్ అసిస్టెంట్/రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్‌లో రెగ్యులరైజ్ చేయబడిన మాజీ వీఆర్ఏల ద్వారా భర్తీ చేస్తారు.
విద్యార్హతలు
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి.
బదిలీ ద్వారా: వీరికి కూడా డిగ్రీ అర్హత ఉండాలి. అయితే, ఇప్పటికే జూనియర్/రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న మాజీ వీఆర్వో/వీఆర్ఏలకు మాత్రం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి, సంబంధిత క్యాడర్‌లో 5 ఏళ్ల సర్వీస్ ఉంటే సరిపోతుంది.
వయస్సు
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికయ్యే అభ్యర్థులకు కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ట వయస్సు 34 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ప్రొబేషన్ కాలం
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన వారికి 2 సంవత్సరాల ప్రొబేషన్ ఉంటుంది. బదిలీ లేదా ప్రమోషన్‌పై వచ్చిన వారికి ఒక సంవత్సరం ప్రొబేషన్ ఉంటుంది.
శిక్షణ, పరీక్షలు
ఎంపికైన అభ్యర్థులు నిర్ణీత కాల వ్యవధిలో శిక్షణ పూర్తి చేయాలి. బాండ్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. నియామకమైన రెండేళ్లలోపు కింది అంశాలపై పరీక్షలు పాస్ కావాలి.
- గ్రామ పాలన ఆఫీసర్ అధికారాలు, విధులు
- విలేజ్ మాన్యువల్ ఆఫ్ అకౌంట్స్
- సర్వే (రెవెన్యూ అవసరాల కోసం)
నియామక అధికారి
గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులకు నియామక, క్రమశిక్షణ అధికారిగా సంబంధిత జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. నియామకాలకు జిల్లాను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. గ్రామాల్లో రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ కొత్త రూల్స్ దోహదపడనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది.
https://x.com/JacobBhoompag/status/2021905413260947618
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



