త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Activists Recognition Committee | తెలంగాణ ఉద్యమకారులకు గుడ్ న్యూస్: వారి గుర్తింపు కోసం 4 కేటగిరీలు.. కేకే కమిటీ తొలి భేటీలో కీలక నిర్ణయాలు

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు రేవంత్ సర్కార్ వేసిన కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ 4 కేటగిరీల ఎంపిక ఏంటి? పూర్తి వివరాలు ఇవే.

J

Telangana | Published On May 17, 2026, 8.00 pm IST

Telangana Activists Recognition Committee | తెలంగాణ ఉద్యమకారులకు గుడ్ న్యూస్: వారి గుర్తింపు కోసం 4 కేటగిరీలు.. కేకే కమిటీ తొలి భేటీలో కీలక నిర్ణయాలు
Advertisement
  • కె.కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి భేటీ
  • అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో కమిటీకి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు
  • త్యాగాలు, కేసుల ఆధారంగా ఉద్యమకారుల గుర్తింపు కోసం 4 కేటగిరీల ప్రతిపాదన
  • గత ప్రభుత్వానికి భిన్నంగా రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ

Telangana Activists Recognition Committee | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలొడ్డి పోరాడిన ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన గౌరవం, సాయం అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తాజాగా సీనియర్ నేత కే కేశవరావు (K Keshava Rao) చైర్మన్‌గా ఏర్పాటైన 'తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ' తొలిసారిగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యమకారులను ఎలా గుర్తించాలి? వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి? అన్న దానిపై ఒక రోడ్ మ్యాప్ (Road map) సిద్ధం చేసింది.

Telangana Activists Recognition Committee Proposes 4 Categories

ఆఫీస్ ఎక్కడ? కమిటీలో ఎవరెవరు ఉన్నారు?

ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ కేశవరావుతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి పాల్గొన్నారు. కమిటీని అధికారికంగా ఏర్పాటు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కమిటీ కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు వీలుగా, హైదరాబాద్‌లోని 'అమరవీరుల జ్యోతి' (Martyrs Memorial) కింద ఉన్న ఆఫీస్‌లో కమిటీకి ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Telangana Activists Recognition Committee Proposes 4 Categories

గుర్తింపు కోసం 4 కేటగిరీల ప్రతిపాదన

ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు కమిటీ ప్రధానంగా నాలుగు కేటగిరీలను (4 Categories) ప్రతిపాదించింది.

మొదటి కేటగిరి: తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు (Martyrs) ఫస్ట్ ప్రయారిటీ (First priority) ఇవ్వనున్నారు.

రెండో కేటగిరి: ఉద్యమ సమయంలో లాఠీచార్జిలు, ఇతర ఘటనల్లో తీవ్రంగా గాయపడిన వారిని ఈ కేటగిరిలో చేరుస్తారు.

మూడో కేటగిరి: జైలు జీవితం గడిపిన వారు, అరెస్ట్ అయిన వారు, పోలీసు కేసులను ఎదుర్కొన్న వారిని మూడో కేటగిరిలో పరిగణిస్తారు.

నాలుగో కేటగిరి: రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో (Grassroots level) ఉండి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారు. పేపర్ కటింగ్స్, ఇతర ఆధారాలను బట్టి వీరికి గుర్తింపు ఇస్తారు.

Telangana Activists Recognition Committee Proposes 4 Categories

అభిప్రాయ సేకరణ.. ఆల్ పార్టీ మీటింగ్

ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో ఎవరికీ అన్యాయం జరగకుండా ఉండేందుకు త్వరలోనే అఖిలపక్ష (All Party) సమావేశం ఏర్పాటు చేయనున్నారు. వివిధ జేఏసీలు (JAC), 1969, 1972, 1996 నాటి పాతతరం ఉద్యమకారులు, ఉద్యోగ, కళాకారుల సంఘాలు, కుల సంఘాలు, న్యాయవాదుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని డిసైడ్ అయ్యారు. పౌరసమాజం అభిప్రాయాలు (Public opinion) తెలుసుకునేందుకు కమిటీ సభ్యులు జిల్లాల్లో పర్యటించనున్నారు.

Telangana Activists Recognition Committee Proposes 4 Categories

రాజకీయాలకు అతీతంగా

గత ప్రభుత్వంలో కేవలం కొంతమందికి మాత్రమే సహాయం అందిందని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పుడు అలాంటి పక్షపాత ధోరణి లేకుండా, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించాలని తీర్మానించింది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేరళ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి రాగానే, ఈ ప్రతిపాదనలపై ఆయనతో చర్చించి ఫైనల్ డెసిషన్ (Final decision) తీసుకోనున్నట్లు కమిటీ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement