త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు.. 100 శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar | రాష్ట్రంలో బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌లు స్వ‌యం ఉపాధి క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 1000 మంది బీసీ మ‌హిళ‌ల‌కు 100 శాతం స‌బ్సిడీతో కుట్టు మిషన్లు అందిచ‌నుంది.

G

Telangana | Published On Apr 26, 2026, 10.05 am IST

Ponnam Prabhakar | నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు.. 100 శాతం సబ్సిడీతో కుట్టు మిషన్లు: మంత్రి పొన్నం ప్రభాకర్
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌లు స్వ‌యం ఉపాధి క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 1000 మంది బీసీ మ‌హిళ‌ల‌కు 100 శాతం స‌బ్సిడీతో కుట్టు మిషన్లు అందిచ‌నుంది. ఈ మేర‌కు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అధికారుల‌ను ఆదేశించారు. ప‌థ‌కం అమ‌లుపై బీసీ సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి బాలమయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భ‌ట్టు, ఇతర అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పించాల‌న్నారు. వారి ఉత్పాదకతను పెంచి, టైలరింగ్ వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు, స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరా చేయాలని ఆదేశించారు.

త్వరలోనే వాటికి అప్లికేషన్ తీసుకొని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని చెప్పారు. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు చొప్పున స్వయం ఉపాధి పెంచుకొని ఆర్థికంగా ఆసరాగా ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంద‌న్నారు. బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి ప్ర‌భుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్న‌ద‌ని వెల్ల‌డించారు.

Advertisement
Advertisement