త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SIR Voter Enumeration | ఎస్ఐఆర్.. ఇంటికే రానున్న బూత్ లేవల్ అధికారులు.. వాళ్లకు ఏ డాక్యుమెంట్లు ఇవ్వాలి? ఫామ్ ఎలా నింపాలి?

జూన్ 25 నుంచి మీ ఇంటికి వచ్చే బీఎల్‌వోలకు ఏ వివరాలు ఇవ్వాలి? ఓటరు సర్వే ఫారంలో ఏమేం నింపాలి? డాక్యుమెంట్లు అడగగానే ఇవ్వాలా? ఈసీ గైడ్‌లైన్స్ ఇవే.

J

Telangana | Published On May 17, 2026, 4.51 pm IST

SIR Voter Enumeration | ఎస్ఐఆర్.. ఇంటికే రానున్న బూత్ లేవల్ అధికారులు.. వాళ్లకు ఏ డాక్యుమెంట్లు ఇవ్వాలి? ఫామ్ ఎలా నింపాలి?
Advertisement
  • జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఓటరు జాబితా సవరణ (SIR) కోసం ఇంటింటికీ బీఎల్‌వోల (BLOs) సర్వే
  • ఓటరు ఫోటో, క్యూఆర్ (QR) కోడ్‌తో కూడిన రెండు ఎన్యుమరేషన్ ఫారాలను పక్కాగా నింపాలి
  • సర్వే సమయంలో బీఎల్‌వోలకు ఎలాంటి ఐడీ ప్రూఫ్స్, డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు
  • జులై 31న డ్రాఫ్ట్ లిస్ట్ విడుదలయ్యాక, అధికారుల నుంచి నోటీసులు వస్తేనే గుర్తింపు కార్డులు చూపించాలి

SIR Voter Enumeration | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఎన్నికల సంఘం 'ప్రత్యేక సమగ్ర సవరణ' (Special Intensive Revision - SIR) కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు (BLOs) నేరుగా మీ ఇంటికే వచ్చి ఎన్యుమరేషన్ (Enumeration) ఫారాలు అందిస్తారు. ఓటర్లంతా రెండు ఫారాల్లో తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే తుది ఓటరు జాబితాలో మీ పేరును చేరుస్తారు. మరి ఈ ఫామ్ ఎలా నింపాలి? డాక్యుమెంట్లు ముందే ఇవ్వాలా? అన్న వివరాలపై రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారులు స్పష్టమైన విధివిధానాలను విడుదల చేశారు.

ఎన్యుమరేషన్ ఫామ్‌లో ఏమేం ఉంటాయి?

మీరు నింపాల్సిన ఫామ్‌లో మీ పేరు, ఎపిక్ (EPIC) నంబర్, అడ్రస్, సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్, నియోజకవర్గం వివరాలు, పాత ఫోటో, అలాగే క్యూఆర్ కోడ్ (QR Code) ముందే ప్రింట్ అయి వస్తాయి. ఆ ఫారంలో మీ పాత ఫోటో పక్కనే తాజాగా దిగిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాలి.

ఫామ్ ఎలా నింపాలంటే

మొదటి కాలమ్: గత SIR ఓటరు జాబితాలో ఉన్న మీ పేరు, ఎపిక్ నంబర్, జిల్లా, రాష్ట్రం, అసెంబ్లీ నియోజకవర్గం తదితర వివరాలను ఎంటర్ చేయాలి.

రెండో కాలమ్: మొదటి కాలమ్‌లో ఉన్న ఓటరుతో మీకు ఉన్న బంధాన్ని (Relationship) ఇక్కడ స్పష్టంగా పేర్కొనాలి.

మూడో కాలమ్: ఇందులో మీ పుట్టిన తేదీ (DOB), ఆధార్ నంబర్ (ఇది ఆప్షనల్ మాత్రమే), మొబైల్ నంబర్, తల్లిదండ్రుల పేర్లు-వారి ఎపిక్ నంబర్లు (తెలిస్తే), అలాగే భార్య లేదా భర్త పేరు-వారి ఎపిక్ నంబర్ వివరాలను నింపాలి.

మొత్తం రెండు ఫామ్‌లు నింపాక, ఒక ఫామ్ రసీదు (Receipt) కింద మీ దగ్గరే ఉంచుకుని, రెండో కాపీని బీఎల్‌వోకు (BLO) ఇవ్వాలి.

ముందుగా ఎలాంటి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదు

చాలామందికి ఉండే అతిపెద్ద డౌట్.. ఎన్యుమరేషన్ సమయంలో ఏవైనా సర్టిఫికెట్లు ఇవ్వాలా? అని. అధికారులు స్పష్టం చేసిన దాని ప్రకారం, బీఎల్‌వోలకు మీరు ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. జులై 31న ముసాయిదా జాబితా (Draft List) ముద్రించిన తర్వాత, మీ వివరాలపై అధికారులకు ఏమైనా అనుమానాలు ఉండి నోటీసులు జారీ చేస్తే.. అప్పుడు మాత్రమే మీ అర్హతను నిరూపించుకునే గుర్తింపు పత్రాలను (ID Proofs) చూపించాలి.

నోటీసులు వస్తే చూపించాల్సిన గుర్తింపు పత్రాలు ఇవే

  • ఎలక్షన్ కమిషన్ (ECI) సూచించిన గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని మీరు సమర్పించవచ్చు
  • ప్రభుత్వ/పీఎస్‌యూ ఉద్యోగులు లేదా పెన్షనర్ల గుర్తింపు కార్డు లేదా పీపీవో (PPO)
  • 01-07-1987కు ముందు ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ఎల్‌ఐసీ తదితర సంస్థలు జారీ చేసిన పత్రాలు
  • ప్రభుత్వం జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ (Birth Certificate)
  • ఇండియన్ పాస్‌పోర్ట్
  • గుర్తింపు పొందిన బోర్డులు జారీ చేసిన టెన్త్ క్లాస్ లేదా ఇతర ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు
  • సంబంధిత అధికారి జారీ చేసిన పర్మినెంట్ రెసిడెన్స్ (నివాస) సర్టిఫికెట్
  • అటవీ హక్కుల పత్రం
  • క్యాస్ట్ సర్టిఫికెట్ (Caste Certificate)
  • జాతీయ పౌర పట్టిక (అమలులో ఉంటే)
  • రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల ఫ్యామిలీ రిజిస్టర్ పత్రం
  • ప్రభుత్వం కేటాయించిన ఇల్లు/భూమి పత్రాలు
  • ఆధార్ కార్డు (కమిషన్ నిబంధనలకు లోబడి)
Advertisement
Advertisement