త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Job Fraud | వ‌ర్క్ వీసాపై న‌ర్వే పంపిస్తామ‌ని మోసం.. ప్ర‌వాసీ ప్ర‌జావాణిలో ఫిర్యాదుతో వెలుగులోకి..!

Job Fraud | నార్వే దేశానికి వర్క్ వీసా ఇప్పించి ఉపాధి కల్పిస్తానని నమ్మించి రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన 35 మంది పట్టభద్రులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బాధితులు మంగళవారం సీఎం ప్రవాసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

P

Telangana | Published On May 5, 2026, 7.45 pm IST

Job Fraud | వ‌ర్క్ వీసాపై న‌ర్వే పంపిస్తామ‌ని మోసం.. ప్ర‌వాసీ ప్ర‌జావాణిలో ఫిర్యాదుతో వెలుగులోకి..!
Advertisement

Job Fraud | నార్వే దేశానికి వర్క్ వీసా ఇప్పించి ఉపాధి కల్పిస్తానని నమ్మించి రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన 35 మంది పట్టభద్రులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బాధితులు మంగళవారం సీఎం ప్రవాసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ‘ఐ బుక్’ అనే ప్రైవేట్ కన్సల్టెన్సీ ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.5 లక్షల చొప్పున వసూలు చేసి, నకిలీ వర్క్ పర్మిట్‌లు, నకిలీ నార్వే వీసా అపాయింట్‌మెంట్ లెటర్లు అందించిందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మోసం గుర్తించిన అనంతరం కేపీహెచ్‌పీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా 146/2026 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు అయినట్లు తెలిపారు.

ఈ ఫిర్యాదును సీఎం ప్రవాసి ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్ రెడ్డి పరిశీలించి సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి డాక్టర్ జీ చిన్నారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చిన్నారెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఎండార్స్‌మెంట్ చేసి సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అదే కార్యక్రమంలో మైనారిటీ గురుకుల పాఠశాలల నాన్ టీచింగ్ సిబ్బంది కూడా తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్ కార్డు సౌకర్యాలు కల్పించడంతో పాటు నిబంధనల ప్రకారం వేతనాలు పెంచాలని వారు కోరారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడిన చిన్నారెడ్డి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement