MP Chamala Kiran Kumar Reddy | గాంధీ సరోవర్ కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు
MP Chamala Kiran Kumar Reddy | మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ సరోవర్ కోసం వడివడిగా భూసేకరణ ప్రక్రియను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను కూడా సేకరించేందుకు ప్రభుత్వం యత్నిస్తుంది. ఈ క్రమంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
MP Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్ : మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ సరోవర్ కోసం వడివడిగా భూసేకరణ ప్రక్రియను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను కూడా సేకరించేందుకు ప్రభుత్వం యత్నిస్తుంది. ఈ క్రమంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులను హరీశ్‌రావు తప్పుదోవ పట్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించాలని చూస్తున్నారు. ముఖ్యంగా గాంధీ సరోవర్ అక్కడ కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. దానికి సంబంధించిన భూమి పక్కన ఉంది. గత ప్రభుత్వం కమీషన్లకు కకక్కుర్తి పడి హైదరాబాద్ నగరంలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు నేడు అపార్ట్‌మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అపార్ట్‌మెంట్ వాసులకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇస్తుంది.. బిల్డర్లపై కచ్చితంగా కేసులు పెడుతామని చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
ప్రభుత్వంపై హరీశ్‌రావు రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి, మూసీ పునరుజ్జీవం కావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. మెట్రో ఫేజ్2, మూసీ ప్రక్షాళన, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం లక్ష్యంగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం అనుకుంటున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రతి పనికి అడ్డుపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయవద్దని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుందని చామల ధ్వజమెత్తారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్





