Dasoju Sravan | ట్రాఫిక్ చలాన్ల ఆటో-డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం.. బ్యాంకు ఖాతాలపై నేరుగా చేయి వేయడం సరికాదు: దాసోజు శ్రవణ్
Dasoju Sravan | రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్లను ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి ఆటో-డెబిట్ (Auto Debit) విధానం ద్వారా నేరుగా వసూలు చేయాలన్న ప్రతిపాదన అత్యంత ఆందోళనకరమైనదని, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైరయ్యారు.
Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్లను ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి ఆటో-డెబిట్ (Auto Debit) విధానం ద్వారా నేరుగా వసూలు చేయాలన్న ప్రతిపాదన అత్యంత ఆందోళనకరమైనదని, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైరయ్యారు. ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచడమే కాకుండా, సామాన్య ప్రజల మౌలిక హక్కులపై నేరుగా దాడి చేయడంగా ఆయన అభివర్ణించారు. ఈమేరకు ఆయన బుధవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ఆటో-డెబిట్ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ట్రాఫిక్ చలాన్ అనేది ఒక ఆరోపణే..
ట్రాఫిక్ నిబంధనల అమలు ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ, చట్టబద్ధమైన ప్రక్రియలను పక్కనపెట్టి ప్రజల బ్యాంకు ఖాతాలపై నేరుగా చేయి వేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ట్రాఫిక్ చలాన్ అనేది నేర నిర్ధారణ కాదు, అది కేవలం ఒక ఆరోపణ (Notice of Allegation) మాత్రమే. చలాన్ వచ్చిన ప్రతి పౌరుడికి వివరణ ఇచ్చే హక్కు, అప్పీల్ చేసుకునే హక్కు, కోర్టును ఆశ్రయించే హక్కు ఉన్నాయి. ఆటో-డెబిట్ విధానం ఈ హక్కులన్నింటినీ హరిస్తూ, నేరం రుజువు కాకముందే శిక్ష విధించినట్లుగా మారుతోంది.
జీవించే, ఆస్తి హక్కులను ఉల్లంఘించినట్టే..
ఈ ప్రతిపాదన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవన హక్కు, ఆర్టికల్ 300A ఆస్తి హక్కులను స్పష్టంగా ఉల్లంఘిస్తుంది. ప్రజల బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు వారి వ్యక్తిగత ఆస్తి. కోర్టు ఆదేశం లేకుండా, స్పష్టమైన చట్టబద్ధ అధికారం లేకుండా ప్రభుత్వం ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమే.
బ్యాంకింగ్ చట్టాలకు వ్యతిరేకం కూడా..
RBI నిబంధనలు, బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఖాతాదారుడి స్పష్టమైన అనుమతి లేదా కోర్టు ఆదేశం లేకుండా బ్యాంకు ఖాతా నుంచి డబ్బును డెబిట్ చేయడం అక్రమం. బ్యాంకింగ్ రంగం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం చట్టపరంగా సాధ్యం కాదు. ఈ విధానం అమలైతే, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకం తీవ్రంగా దెబ్బతింటుంది.
ఎంపిక హక్కు పౌరుడిదే..
సుప్రీంకోర్టు పుట్టస్వామి తీర్పు ప్రకారం గోప్యత హక్కు ఒక మౌలిక హక్కు. ట్రాఫిక్ చలాన్ల పేరిట ప్రజల బ్యాంకు ఖాతా వివరాలను వినియోగించడం అవసరం లేని, అసమంజసమైన జోక్యంగా మారుతుంది. మోటారు వాహనాల చట్టం సెక్షన్ 200 ప్రకారం చలాన్ చెల్లించాలా లేదా కోర్టుకు వెళ్లాలా అనే ఎంపిక హక్కు పూర్తిగా పౌరుడిదే. ఆటో-డెబిట్ విధానం ఈ ఎంపికను పూర్తిగా హరిస్తుంది.
ప్రభుత్వం ప్రజల సంపదను కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉండాలి గానీ, ప్రజల బ్యాంకు ఖాతాలను లక్ష్యంగా చేసుకుని వసూళ్ల యంత్రాంగంగా మారకూడదు. ట్రాఫిక్ చలాన్ల పేరిట ఆటో-డెబిట్ విధానం అమలైతే, అది “Licensed Extortion”గా మారే తీవ్రమైన ప్రమాదం ఉంది. ఈ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రజాస్వామ్య, చట్టబద్ధమైన విధానాలనే అనుసరించాలి. ప్రజల మౌలిక హక్కులు, గోప్యత, ఆస్తి హక్కులను గౌరవించాలి అని దాసోజు శ్రవణ్ సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం
- ●realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో.. రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..
- ●Ponguleti Srinivas Reddy | 15,475 మందికి రూ.185 కోట్లు విడుదల చేశాం.. రేపు చివరి బిల్లుల మొత్తం ఖాతాల్లో జమ చేస్తాం
- ●Harish Rao | కాంగ్రెస్ వైఫల్యానికి నాగార్జునసాగర్ కుడి కాలువ నీళ్లే సాక్ష్యం : హరీశ్‌రావు
- ●Stock Markets | అమెరికా ద్రవ్యోల్బణ భయాలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Dasoju Sravan Kumar | కుల గణనలో ఓబీసీ కేటగిరీ చేర్చాలి

Dasoju Sravan Kumar | ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం

realme P4s 5G | 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో.. రియల్‌మి కొత్త స్మార్ట్ ఫోన్..

Ponguleti Srinivas Reddy | 15,475 మందికి రూ.185 కోట్లు విడుదల చేశాం.. రేపు చివరి బిల్లుల మొత్తం ఖాతాల్లో జమ చేస్తాం

Harish Rao | కాంగ్రెస్ వైఫల్యానికి నాగార్జునసాగర్ కుడి కాలువ నీళ్లే సాక్ష్యం : హరీశ్‌రావు




