త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalva Sujatha | ఈవీ రేసు కేసుపై ఎందుకంత గుబులు?.. కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత‌ల ఫైర్‌

Kalva Sujatha | బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, ఆర్య వైశ్య కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ కల్వ సుజాత మండిపడ్డారు. ఈవీ రేసు కేసును చిన్నదిగా చిత్రీకరిస్తున్న కేటీఆర్‌.. కోర్టులో కేసు ఎదుర్కోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

P

Telangana | Published On Oct 13, 2026, 9.15 pm IST

Kalva Sujatha | ఈవీ రేసు కేసుపై ఎందుకంత గుబులు?.. కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత‌ల ఫైర్‌
Advertisement

Kalva Sujatha | బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, ఆర్య వైశ్య కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ కల్వ సుజాత మండిపడ్డారు. ఈవీ రేసు కేసును చిన్నదిగా చిత్రీకరిస్తున్న కేటీఆర్‌.. కోర్టులో కేసు ఎదుర్కోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో రూ.54 కోట్ల లావాదేవీలు ఎలా జరిగాయని నిలదీశారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రవిచంద్రతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

రూ.54 కోట్ల బదిలీపై ప్రశ్నలు

ఈవీ రేసు కేసు చిన్నదేనని చెబుతున్న కేటీఆర్‌.. దానిపై ఎందుకు ఆందోళన చెందుతున్నారని కల్వ సుజాత ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో రూ.54 కోట్ల లావాదేవీ జరిగిందని ఆరోపించారు. తనకు నచ్చిన కంపెనీకి నిధులు బదిలీ చేయించుకునే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న కేటీఆర్‌.. ఈ కేసు విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. దేశంలో ఓట్ల చోరీకి బీజేపీ పాల్పడుతోందని కల్వ సుజాత ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలను అరికట్టాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ లేవనెత్తిన అంశాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎస్‌ఐఆర్‌ సక్రమంగా నిర్వహించాలి

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని కల్వ సుజాత కోరారు. ఓట్ల చోరీ ద్వారా అధికారంలో కొనసాగాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. యువతలో పెరుగుతున్న సమస్యలపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. రాహుల్‌గాంధీని రాజకీయంగా అణచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement
Advertisement