CM Revanth Reddy | నేనే రోడ్‌పైకి వస్తా
CM Revanth Reddy | వర్షం కురిసిన సమయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైన ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే తానే స్వయంగా రోడ్‌పైకి వస్తానని స్పష్టం చేశారు. వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
- వర్షాల పైన రివ్యూ పెట్టి.. నేను సూచనలిచ్చినా మీరు పట్టించుకోలేదు
- వర్షం పడినప్పుడు.. యంత్రాంగమంతా ఫీల్డ్‌లో ఉండాల్సిందే
- మున్సిపల్ - పోలీసు విభాగాల మధ్య సమన్వయం లేదు
- ఇలాగైతే ఎలా... ప్రాజెక్టుల వద్ద అప్రమత్తంగా ఉండండి
- రైతు వేదికల్లో యూరియా ఇవ్వండి
- అధికారులందరికీ సీఎం క్లాస్
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: వర్షం కురిసిన సమయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైన ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే తానే స్వయంగా రోడ్‌పైకి వస్తానని స్పష్టం చేశారు. వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మానవ తప్పిదాల వల్ల సమస్యలు వస్తే సహించబోనన్నారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్‌లో తక్షణమే ఖాళీలు పూర్తి చేయాలని సూచించారు. ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో వర్షాలు, ప్రకృతి విపత్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ఆదివారం సమీక్షించారు. వర్షాల సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
ముందస్తు సూచనలు ఇచ్చినా ఫలితం లేదు
ఈ నెల 1న సమీక్షా సమావేశం నిర్వహించి, వర్షాలపై ముందస్తు సూచనలు ఇచ్చినప్పటికీ ఫలితం లేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 9న వర్షం సమయంలో అధికారులు సరిగా పని చేయలేదని మండిపడ్డారు. వర్షం సమయంలో క్యూర్ ఏరియాలో మునిసిపల్, పోలీస్ అధికారుల మధ్య సమన్వయం లేదని తేల్చి చెప్పారు. వర్షం వచ్చినప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్స్, బ్లాక్ స్పాట్స్, ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రాంతాల డేటా ఆధారంగా పని చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఫీల్డ్ లో ఉండని అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రాజెక్టుల నిర్వహణకు తక్షణమే నిధులు..
వర్షాల నేపథ్యంలో ప్రాజెక్ట్ ల దగ్గర పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్వహణ మ్యానువల్ ప్రకారం జరగాలని, ప్రాజెక్టు సంబంధిత ఇంజనీర్లు కచ్చితంగా దానిని అమలు చేయాల్సిందేనన్నారు. ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈ లు ఈ సీజన్‌లో స్థానికంగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇంజినీర్లు ప్రాజెక్టులు వదిలి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాజెక్టుల మెయింటెన్స్, గేట్ల మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఇరిగేషన్, మెట్రో వాటర్ బోర్డు, RWS అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
రైతు వేదికలను యూరియా పంపిణీ కోసం ఉపయోగించుకోవాలన్నారు. రైతు వేదికలో యూరియా పంపిణీ బాధ్యతను స్థానిక అగ్రికల్చర్ అధికారికి అప్పగించాలని చెప్పారు. యూరియా పంపిణీలో రెవిన్యూ సిబ్బందిని భాగస్వామ్యం చేయాలన్నారు.
ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, వికాస్ రాజ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మూడు కార్పొరేషన్ల మున్సిపల్ కమిషనర్‌లు కర్ణన్, సృజన, వినయ్ క్రిష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్‌లు సజ్జనార్, రమేష్ రెడ్డి, సుమతి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎంఓ అధికారులు, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఆర్ అండ్ బీ, జలమండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
జూన్ 15, 2026

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
జూన్ 15, 2026

Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా ‘డ్యాన్సింగ్ డాఫోడిల్స్’!
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి



