త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేవంత్ పాలన అంటేనే.. రాక్షస పాలన : హ‌రీశ్‌రావు

Harish Rao | రేవంత్ పాల‌న అంటేనే రాక్ష‌స పాల‌న అని హ‌రీశ్‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది గడీల పాలన.. బేడీల పాలన, అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేసిండ‌ని మండిప‌డ్డారు. రైతుల భూముల లాక్కునే నోటిఫికేషన్ రద్దు చేసే దాకా మా పోరాటం ఆగద‌న్నారు.

P

Telangana | Published On Apr 7, 2026, 2.38 pm IST

Harish Rao | రేవంత్ పాలన అంటేనే.. రాక్షస పాలన : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | రేవంత్ పాల‌న అంటేనే రాక్ష‌స పాల‌న అని హ‌రీశ్‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది గడీల పాలన.. బేడీల పాలన, అన్ని వర్గాల ప్రజలను నమ్మించి మోసం చేసిండ‌ని మండిప‌డ్డారు. రైతుల భూముల లాక్కునే నోటిఫికేషన్ రద్దు చేసే దాకా మా పోరాటం ఆగద‌న్నారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింద‌ని.. నాడు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం అన్నరు, నేడు ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తున్నార‌న్నారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశార‌ని, ఇప్పుడు రైతులను కలవకుండా నిర్బంధాలు పెడుతున్నార‌న్నారు. రైతులను కలిసేందుకు వెళ్తుంటే అరెస్టులు చేయడం దౌర్జన్యమ‌ని, ఇది గడీల పాలన, బేడీల పాలన, నిర్బందాల పాలన అంటూ మండిప‌డ్డారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నద‌ని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాద‌న్నారు.

రెండు మూడు పంటలు పండే భూముల్లో పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణ‌మ‌ని, భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి. అప్పటి దాకా పోరాటం ఆగద‌న్నారు. రైతులకు ధైర్యం చెప్పడానికి వెళ్తుంటే మా గొంతు నొక్కుతున్నార‌ని.. నీ పాలన అంతా బోగస్ మాటలు, బోగస్ గ్యారెంటీల‌న్నారు. రాముడు రాక్షసుడు అంటున్నడు రేవంత్ రెడ్డి.. రేవంత్‌ను మించిన రావణాసురుడు ఇంకెవరు ఉండ‌ర‌న్నారు. పేదల ఇళ్లు కూల్చుతూ వికృతానందం పొందుతున్నార‌ని ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని మోసం చేశాడ‌ని, అవ్వాతాతల వద్దకు పోయి రాక్షస పాలన ఎవరు అంటే రేవంత్ అంటున్నార‌న్నారు. విద్యార్థులను, మహిళలను, పోలీసులను ఎవర్ని అడిగినా వారు రేవంత్ రెడ్డే రాక్షసుడు అంటున్నార‌ని, అన్ని వర్గాలను మోసం చేయడంలో రేవంత్ రెడ్డి విజయవంతం అయ్యిండ‌న్నారు. వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలుసుడు కాదు కదా..ప్రతిపక్ష హోదా కూడా రాద‌ని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా సింగిల్ డిజిట్ మాత్రమే కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డి అంటే అయిపోయిన కథ అని, నువ్వు మల్లా గెలుస్తావు అనేది పగటి కల.. వచ్చేది రామ రాజ్యం, కేసీఆర్ రాజ్య‌మ‌న్నారు.

Advertisement
Advertisement