KCR | కేసీఆర్ కు అడుగడుగునా జన నీరాజనం.. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ భగ్గు
KCR | సిట్ విచారణకు ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ కు ఆదివారం బయలుదేరిన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు అడుగడుగునా జన నీరాజనాలు వెల్లువెత్తాయి.
సంక్షిప్త సారాంశం
KCR | సిట్ విచారణకు ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ కు ఆదివారం బయలుదేరిన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు అడుగడుగునా జన నీరాజనాలు వెల్లువెత్తాయి. రహదారి వెంట వెళ్తున్న కేసీఆర్ ను అభిమానులు మొబైల్ ఫోన్లల్లో బంధిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ములుగులో కేసీఆర్‌కు డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ నేతలు పుష్పాలతో అభివందనం తెలిపారు.
KCR | త్రినేత్ర.న్యూస్ : సిట్ విచారణకు ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ కు ఆదివారం బయలుదేరిన మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు అడుగడుగునా జన నీరాజనాలు వెల్లువెత్తాయి. రహదారి వెంట వెళ్తున్న కేసీఆర్ ను అభిమానులు మొబైల్ ఫోన్లల్లో బంధిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ములుగులో కేసీఆర్‌కు డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ నేతలు పుష్పాలతో అభివందనం తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ఇస్నాపూర్ జాతీయ రహదారిపై భైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

గులాబీ జెండాలతో..
కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్ష సాధింపు వైఖరిని దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఖండించారు. ఆయన ఆధ్వర్యంలో సిద్దిపేట క్యాంపు కార్యాలయం నుంచి వేలాది మంది అభిమానులు బైకు ర్యాలీ నిర్వహించారు. గులాబీ జెండాలు చేతబూని జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ రాక కోసం వివిధ గ్రామాల్లోని ప్రజలు రహదారి వెంట సమూహాలుగా పోగయ్యారు. ఆ జన సందోహంలో చిక్కుకున్న కేసీఆర్ కాన్వాయ్ ని పోలీసులు రిస్క్ తీసుకొని పంపించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



