త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gandhi Sarovar | న‌గ‌రానికి త‌ల‌మానికంగా గాంధీ స‌రోవ‌ర్‌

Gandhi Sarovar | మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుట్టింది.

S

Telangana | Published On Feb 13, 2026, 7.07 am IST

Gandhi Sarovar | న‌గ‌రానికి త‌ల‌మానికంగా గాంధీ స‌రోవ‌ర్‌
Advertisement

ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రాజెక్టు
ప్ర‌పంచ‌స్థాయి కేంద్రంగా రూపొందించేందుకు ప్ర‌ణాళిక‌
ఈ నెలాఖ‌రులో శంకుస్థాప‌న‌

Gandhi Sarovar | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు శ్రీ‌కారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈసా, మూసీ న‌దుల సంగ‌మ ప్ర‌దేశంలో ప్రపంచ‌స్థాయి విద్య‌, సాంస్కృతిక‌, ఆధ్యాత్మిక, ప‌ర్యావ‌ర‌ణ కేంద్రంగా ఈ ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న చేశారు. న‌గ‌రంలో బాపూఘాట్ ఉన్న ప్రాంతంలోనే గాంధీజీ ఆశ‌యాలైన శాంతి, ఐక్య‌త‌, సుస్థిరాభివృద్ధి, నిరాడంబ‌ర జీవ‌న‌శైలిని అద్దం ప‌ట్టేలా నూత‌న ప్రాజెక్టును ఖ‌రారు చేశారు. సుస్థిర ప‌ట్ట‌ణాభివృద్ధి ల‌క్ష్యాల‌తో ప‌ర్యావ‌ర‌ణ హితంగా, స్వ‌చ్ఛ‌మైన నీటితో న‌ది ప్ర‌వ‌హించేలా ఈ ప్రాజెక్టులో భాగంగా శాంతి చిహ్నం, జాతీయ మ్యూజియం, విజ్ఞాన కేంద్రం, చేనేత ప్రోత్సాహ‌క కేంద్రాల‌ను నెల‌కొల్ప‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

2023 డిసెంబ‌ర్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే మూసీ పున‌రుజ్జీవన ప్రాజెక్టును అట్టాహాసంగా ప్ర‌క‌టించారు. అందులో భాగంగానే గాంధీ స‌రోవ‌ర్‌ ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 222.27 ఎక‌రాల ర‌క్ష‌ణ భూముల‌ను అప్ప‌గించాల‌ని కేంద్ర‌మంత్రిని 2024 న‌వంబ‌ర్ 26న క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. 2025 సెప్టెంబ‌ర్ 10న తిరిగి కేంద్ర‌మంత్రిని క‌లిసి స‌వ‌రించిన అంచ‌నా ప్ర‌కారం 98.20 ఎక‌రాల ర‌క్ష‌ణ భూమిని బ‌దిలీ చేయాల‌ని కోరారు. ప్ర‌స్తుత పార్ల‌మెంట్ బడ్జెట్ స‌మావేశాలలో లోక్‌స‌భ సభ్యుడు ఈటెల రాజేంద‌ర్ ఈ నెల 6న అడిగిన ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ర‌క్ష‌ణ భూమి కేటాయింపుపై ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు అవ‌స‌ర‌మైన వంద ఎక‌రాల ర‌క్ష‌ణ శాఖ భూముల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వానికి బ‌ద‌లాయించాల‌ని కోరుతూ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ నెలాఖ‌రులో జ‌రుగ‌నున్న ప్రాజెక్టు శంఖుస్థాప‌న‌, భూమిపూజ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల్సిందిగా ఆయ‌న‌ను ఆహ్వానించారు.

Advertisement
Advertisement