V Srinivas Goud | రైతులను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
V Srinivas Goud | రాష్ట్రంలో రైతులు సాగునీరు లేక పంటలు కోల్పోతుంటే, ప్రభుత్వం ఎల్‌నినోను సాకుగా చూపుతూ క్రాప్ హాలిడే ప్రకటించిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. రైతులకు ప్రత్యామ్నాయం చూపకుండా పంటలు వేయొద్దంటే వారి జీవనోపాధి ఎలా సాగుతుందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
- క్రాప్ హాలిడే ప్రకటిస్తే సమస్యలు పరిష్కారమవుతాయా?
- సాగునీరు, తాగునీరు అందించడంలో విఫలం..
- పంట నష్టపరిహారం చెల్లించాలి
- సర్కారుపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజం
V Srinivas Goud | రాష్ట్రంలో రైతులు సాగునీరు లేక పంటలు కోల్పోతుంటే, ప్రభుత్వం ఎల్‌నినోను సాకుగా చూపుతూ క్రాప్ హాలిడే ప్రకటించిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. రైతులకు ప్రత్యామ్నాయం చూపకుండా పంటలు వేయొద్దంటే వారి జీవనోపాధి ఎలా సాగుతుందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా నది నుంచి సుమారు 350 టీఎంసీల నీరు దిగువకు వెళ్లినా, కనీసం 30 టీఎంసీలను కూడా నిల్వ చేసుకోలేకపోయారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 185 టీఎంసీల నుంచి 70 టీఎంసీలకు పడిపోయిందని పేర్కొన్నారు. సుమారు 60 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నా మోటార్లు ఆన్ చేయడం లేదని విమర్శించారు. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలో నీటిని నిల్వ చేసుకుంటున్న పొరుగు రాష్ట్రాలను చూసైనా ప్రభుత్వం మేల్కొనాలని సూచించారు.
రైతులకు పరిహారం చెల్లించాలి
రెండో పంట సాగు చేయొద్దని చెప్పిన ప్రభుత్వం.. పంటలు వేయలేకపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎండిపోతున్న పంటలకు తక్షణమే పరిహారం చెల్లించాలని కోరారు. రైతులపై ఆధారపడిన వ్యవసాయ కూలీలనూ ఆదుకోవాలని సూచించారు. క్రాప్ హాలిడే ప్రకటించడం పరిష్కారం కాదని, ప్రత్యామ్నాయ ఉపాధి, ఆర్థిక సాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, నీటి కోసం ప్రజలు ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ముందస్తు ప్రణాళికతో పనిచేయాల్సిన ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుంటోందని విమర్శించారు. విద్యుత్ సరఫరా, సాగునీరు, ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన వనరుల విషయంలో సంబంధిత మంత్రులు పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు.
ఉద్యోగులకు వైద్యం అందించాలి
ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు హెల్త్ కార్డులు పనిచేయక ఆసుపత్రుల్లో వైద్యం పొందలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం సమావేశమై సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, పోలీసులు, హోంగార్డులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని, రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలు కాక నిరుద్యోగులు ఉద్యమిస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలనూ పరిష్కరించాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రతి శాఖ మంత్రి తన విభాగంపై పట్టు సాధించి, ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్యుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Strategic MoU | తెలంగాణ–లివర్‌పూల్ మధ్య కీలక ఒప్పందం
- ●Kalva Sujatha | ఈవీ రేసు కేసుపై ఎందుకంత గుబులు?.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫైర్
- ●Civil Supplies Department | బకాయి సీఎంఆర్ చెల్లించకుంటే ఆస్తుల జప్తు!
- ●Rajanna Sircilla | రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గం
- ●Aafia Sayed | నితిన్ అలియాస్ రుక్మిణికి హీరోయిన్ దొరికిందోచ్ - బాలీవుడ్ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా!
- ●Rahul Gandhi | న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: రాహుల్ గాంధీ

Strategic MoU | తెలంగాణ–లివర్‌పూల్ మధ్య కీలక ఒప్పందం

Kalva Sujatha | ఈవీ రేసు కేసుపై ఎందుకంత గుబులు?.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫైర్

Civil Supplies Department | బకాయి సీఎంఆర్ చెల్లించకుంటే ఆస్తుల జప్తు!

Rajanna Sircilla | రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గం



