త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasyam Vinay Bhasker | వ‌రంగ‌ల్‌ జన చైతన్య సభలో భారీ చేరిక‌లుంటాయ్‌

Dasyam Vinay Bhasker | వ‌రంగ‌ల్‌ (Warangal)లో ఈనెల 22 నిర్వ‌హించే జ‌న చైత‌న్య స‌భ‌ (Public Awareness Meeting)లో బీజేపీతో స‌హా వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరిక‌లుంటాయ‌ని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhasker) తెలిపారు.

S

Telangana | Published On Nov 18, 2026, 1.04 pm IST

Dasyam Vinay Bhasker | వ‌రంగ‌ల్‌ జన చైతన్య సభలో భారీ చేరిక‌లుంటాయ్‌
Advertisement
  • ఈనెల 22న జ‌రిగే స‌భ‌కు కేటీఆర్ ముఖ్య అతిథిగా వ‌స్తున్నారు
  • కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు త‌ర‌లొచ్చి విజ‌య‌వంతం చేయాలి
  • వ‌రంగ‌ల్‌లో మీడియా స‌మావేశంలో దాస్యం విన‌య్‌భాస్క‌ర్ పిలుపు

Dasyam Vinay Bhasker | త్రినేత్ర న్యూస్‌: వ‌రంగ‌ల్‌ (Warangal)లో ఈనెల 22 నిర్వ‌హించే జ‌న చైత‌న్య స‌భ‌ (Public Awareness Meeting)లో బీజేపీతో స‌హా వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరిక‌లుంటాయ‌ని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhasker) తెలిపారు. కేడీసీ మైదానంలో జ‌రిగే ఈ స‌భ‌కు కేటీఆర్ (KTR) ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్నార‌ని.. కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు భారీగా త‌ర‌లొచ్చి విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు చేశారు.

కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు పూర్వవైభవం సాధ్యం. వివిధ పార్టీల నాయకులు, మేధావులు, యువతను బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నాం. ఈ సభ కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమ‌మే కాదు. నగరంలోని మేధావులు, విద్యావంతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువత, ప్రజలు భాగస్వాములయ్యే ప్రజా చైతన్య సభగా నిలవబోతోంది. ఇప్పటికే నగరంలో సభపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అని దాస్యం విన‌య్‌భాస్క‌ర్ పేర్కొన్నారు.

 

అనంత‌రం మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ నాయకులు ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని, కేటీఆర్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు. కేసీఆర్‌తోనే తెలంగాణకు పూర్వవైభవం సాధ్య‌మ‌న్నారు.

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రానికి పూర్వవైభవం వస్తుందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో చాలా వరకు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. కేటీఆర్ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని, బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతామని తెలిపారు. కాంగ్రెస్ అభయహస్తం కాదు భస్మాసురా హస్తం అని విమ‌ర్శించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement