KTR | తెలంగాణ కథలో నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ: కేటీఆర్
KTR | తెలంగాణకు అసలు విలన్ కాంగ్రెస్ (Congress) పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తెలంగాణ (Telangana) ఉద్యమాన్ని కర్కషంగా అణచివేసింది, 370 మంది పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిపించింది, వందలు, వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు.
KTR | త్రినేత్ర.న్యూస్: తెలంగాణకు అసలు విలన్ కాంగ్రెస్ (Congress) పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. తెలంగాణ (Telangana) ఉద్యమాన్ని కర్కషంగా అణచివేసింది, 370 మంది పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిపించింది, వందలు, వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. ఇచ్చిన మాట తప్పి పదేండ్ల పాటు తెలంగాణను కాల్చుక తిన్నదని మండిపడ్డారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, ఎన్నో రకాల బలిదానాలతో రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ కథలో నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించి 12 ఏండ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ సోమాజీగూడలో నిర్వహించిన `మీట్ దీ ప్రెస్` కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
యువత ఒకటి గుర్తుపెట్టుకోవాలి..
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. తెలంగాణ ఏ ఒక్కరివల్లో, ఏ ఒక్క పార్టీ, సంస్థ వల్లనో వచ్చిందని మేమూ అనుకోవడం లేదు. ప్రజలు, దేశం ఎవరూ కూడా అలా అనుకోవడం లేదు. రాష్ట్రం ఏర్పడి పుష్కరం అవుతున్నది. మా పార్టీ 25 ఏండ్ల ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్నది. తెలంగాణ ఆశామాశీగా వచ్చిన రాష్ట్రం కాదు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, ఎన్నో రకాల బలిదానాలతో ఏర్పడి రాష్ట్రం. తరం మారిన ప్రతి సందర్భంలో కొత్తకొత్త ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి. కానీ ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువత ఒకటి గుర్తుపెట్టుకోవాలి.
మనకు తమన తాతల కథ, తండ్రుల కథ, మన జాతి కథ లెలియకపోతే భవిష్యత్తు కూడా మనకు అర్ధమయ్యే ఆస్కారం లేదు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏండ్లు పూర్తయ్యాయి. స్వాతంత్య్రానికి పూర్వం ఏముండే ఏం లేదు అన్నీ మరచిపోదామంటే కుదరదు. స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటాలు, త్యాగాలు అన్నీ మననం చేసుకుంటేనే భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ విషయంలో కూడా తాతల కథ, తండ్రుల కథ తెలుసుకోకపోతే నీ కథేందో కూడా తెలుసుకునే అవకాశం లేదు.
తరాలు మారినా వాస్తవాలు మారవు..
ప్రతి యుగంలో, ప్రతి కథలో నాయకులు ఉంటారు. ప్రతి నాయకులు ఉంటారు. తరాలు మారినా, స్వరాలు మారినా వాస్తవాలు మాత్రం మారవు. ఎన్నో యుగాలు మారినా రామయణ, మహాభారతాల గురించి చెప్పుకుంటూనే ఉంటా. రామాయణ, మహాభారాతాలు చదువుతుంటే మారీచుడి మాయలు, శకుని మామ పాచికలు, శికండి పాత్ర, సైంధవుడి పాత్ర ఏందో, ఎవరు హీరోనో, ఎవరు విలనో అర్ధవమవుతుంది. అలాగే తెలంగాణ కథలో కూడా ఒక మహోన్నతమైన గతం ఉంది, మహోజ్వల చరిత్ర ఉంది. ఇక్కడ వీరుడున్నాడు. వీరోచిత గాథలు ఉన్నాయి. అమరులు ఉన్నారు. త్యాగాలు ఉన్నాయి. ద్రోహాలు ఉన్నాయి. ధోఖాలు ఉన్నాయి. బానిస సంకెళ్లు తెంచిన పోరాట కథ ఉంది, కథానాయకుడు కూడా ఉన్నాడు. ఈ కథలో మారీచుడు ఎవరో, శకుని, శికండి, దుశ్శాసనులు ఎవరో తప్పుకుండా వచ్చే తరవం తెలుసుకోవాలి.
ఉన్న తెలంగాణను ఊడగొట్టి..
1952లో ఇంకా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరుగకముందే తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న విషయం అందరికీ తెలుసు. ఆరోజుల్లోనే ఫజల్ అలీ కమిషన్ సిఫారసులకు విరుద్ధంగా హైదరాబాద్‌ను ఇతర ప్రాంతాలతో కలుపుతారనే ఆందోళనతో 1952లో గైర్ ముల్కీ ఉద్యమం జరిగింది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుపాకుల మోతతో హైదరాబాద్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వద్ద ఏడుగురిని బలిగొన్నది. 1956లో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతపు పెండ్లి చేసి ఆంధ్ర, తెలంగాణను కలిపింది కూడా కాంగ్రెస్ పార్టీ అనే విలన్. అందులో ఏమాత్రం అనుమానం లేదు.
ఉన్న తెలంగాణను ఊడగొట్టింది, చాలా మందిని బలి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. తర్వాత పెద్దమనుషుల ఒప్పందాల వంటి కొన్ని ఉపషమనాల పేరుతో కొంతకాలం వ్యవహారం నడించింది. సరిగ్గా 12 ఏండ్లలోని 1968 నాటికే తొలి దశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. విద్యార్థులు, ఉద్యోగులు సారథులై ఉద్యమాన్ని నడిపించారు. రాజకీయ నాయకత్వం లేదు. 1968 నుంచి 1971 వరకు ఉద్యమం జరిగితే 370 మంది పిల్లలను బలిగొన్నది కాంగ్రెస్ పార్టీయే.
1971లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 14కుగాను 11 స్థానాలను తెలంగాణ ప్రజా సమితి బ్యానర్‌పై పోటీచేసిన అభ్యర్థులను తెలంగాణ ప్రజలు గెలిపించారు. మాకు తెలంగాణ కావాలి అనే ఆకాంక్షను 1952లో, 1968లో ఎలాగైతే చెప్పారో 1971లో కూడా నిర్ధ్వంధంగా చెప్పారు. మా తెలంగాణ మాకివ్వండి నాటి కేంద్ర ప్రభుత్వానికి చెబితే ఆ ఉద్యమాన్ని కర్కషంగా అణచివేసింది కూడా అప్పుడున్న కాంగ్రెస్ అధినాయకత్వం, కాంగ్రెస్ పార్టీనే.
మాట ఇచ్చి మోసం చేసి..
2021లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని పెట్టిన తర్వాత.. 2004లో మా దగ్గరకు వచ్చి పొత్తుపెట్టుకుని తెలంగాణ మనో భావాలను గౌరవిస్తామని, రాష్ట్రం ఇస్తామని ఎన్నికల ఎజెండాలో పెట్టి, కామన్ మినిమం ప్రోగ్రామ్‌లో పెట్టి, భారత రాష్ట్రపతితో చెప్పించి పదేండ్లపాటు తెలంగాణను కాల్చుక తిన్నది, వందల వేల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరన్న ఉన్నారంటే, కచ్చితంగా తెలంగాణ కథలో నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదు.
జూన్ 2 వెనక నవంబర్ 29..
కాంగ్రెస్ 2004లో మాటిచ్చి 2014 వరకు నెరవేర్చకపోయినా పోరాటాలు ఆగలేదు. కేసీఆర్ నాయకత్వంలో పదేండ్ల పాటు, అంతకుముందు నాలుగేండ్లు పోరాటం చేసినం కాబట్టే చివరకు 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. జూన్ 2 ఎలా వచ్చిందంటే దాని వెనక నవంబర్ 29 ఉంది. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని మొండిగా కూర్చోక పోతే.. కేసీఆర్ శవయాత్రనో, తెలంగాణ జైత్రయాత్రనో అని కూర్చోకపోతే ఇవ్వాల తెలంగాణ రాష్ట్రమూలేదు.
తాజావార్తలు
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?
- ●DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!
- ●Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
- ●Foreigners’ Registration | ఆ పత్రాలు సమర్పించాల్సిందే.. ఇమ్మిగ్రేషన్ చట్టంపై పోలీసుల వార్నింగ్..!
- ●Accident | అమెరికాలో కారు ప్రమాదం.. మాజీ ఎంపీ సతీమణి సుచియాష్కీకి గాయాలు

Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు

Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

DK Shivakumar | కర్నాటకలో కొలువుదీరిన కొత్త సర్కారు.. విద్య, ఉద్యోగం, రైతులపై డీకే ఫోకస్..!

Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు





