త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌పై సీఎం వ్యాఖ్య‌లు సిగ్గుచేటు: రాంచంద‌ర్‌రావు

Ramchandar Rao | మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం మోదీ ప్రభుత్వం రాజీవ్ గాంధీని చూసి స్ఫూర్తి పొందాలని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు కేవలం గర్హనీయమే కాకుండా అత్యంత విడ్డూరంగా ఉన్నాయ‌ని బీజేపీ చీఫ్ ఎన్ రాంచంద‌ర్‌రావు విమ‌ర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి ఆనాడు ఉన్న అఖండ బ‌లాన్ని ఏమాత్రం ఉపయోగించలేదన్నారు.

S

Telangana | Published On May 21, 2026, 6.21 pm IST

Ramchandar Rao | మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌పై సీఎం వ్యాఖ్య‌లు సిగ్గుచేటు: రాంచంద‌ర్‌రావు
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం మోదీ ప్రభుత్వం రాజీవ్ గాంధీని చూసి స్ఫూర్తి పొందాలని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు కేవలం గర్హనీయమే కాకుండా అత్యంత విడ్డూరంగా ఉన్నాయ‌ని బీజేపీ చీఫ్ ఎన్ రాంచంద‌ర్‌రావు విమ‌ర్శించారు. రాజీవ్ గాంధీ 400కు పైగా ఎంపీ స్థానాలతో తిరుగులేని మెజారిటీతో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. ఆ అఖండ బలాన్ని మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి ఏమాత్రం ఉపయోగించలేదన్నారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌రిచ్చారు.

ఏకంగా ఏడుసార్లు..

షా బానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చ‌రిత్రాత్మక తీర్పును పక్కదారి పట్టించారు. విడాకులు తీసుకున్న ఒక ముస్లిం మహిళకు దక్కాల్సిన న్యాయమైన భరణాన్ని వారి ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. మహిళా హక్కుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అసలు ట్రాక్ రికార్డ్ ఇదే. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును జాప్యం చేసింది.. అడ్డుకుంది.. వీగిపోయేలా చేసింది. అది ఒక్కసారి కాదు.. ఏకంగా ఏడుసార్లు. అలాంటి చరిత్ర పెట్టుకుని నేడు ఆ పార్టీ నాయకులు ప్రధాని మోదీకి మహిళా సాధికారతపై నీతులు చెప్పడం సిగ్గుచేటు. మహిళా సాధికారత విష‌యంపై మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదు అని రాంచంద‌ర్‌రావు మండిప‌డ్డారు.

Advertisement
Advertisement